సాధార‌ణంగా రెస్ట్ రూం లు అలాగే స్లీపింగ్ గ‌దులు అనేవి మ‌న‌కు క‌నిపిస్తూ ఉంటాయి. కానీ ఒక చోట త‌నివి తీర ఏడ్వ డానికి కూడా ప్ర‌త్యేకంగా గ‌దులు ఉంటాయి. వీటిని ఆ దేశ ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యం లో నే న‌డుస్తాయి. విన‌డానికి ఆశ్చ‌ర్యం గా ఉన్న ఇది నిజం అండి. ఇది ఎక్క‌డ అంటే స్పెయిన్ అనే దేశంలో ఏర్పాటు చేశారు. ఈ గ‌దుల‌ను కూడా ఆ దేశ ప్ర‌భుత్వమే న‌డిపిస్తుంది. ఈ గ‌దు ల‌కు క్రయింగ్ రూం అని క్ర‌యింగ్ సెంట‌ర్ అని పేరు కూడా పెట్టింది. దీనిక గ‌ల కారణం ఎంటి అంటే సాధార‌ణంగా సమాజంలో ఏడ్చే వారి చుల‌క‌న గా చూస్తారు. అది అబ్బాయిలు అయిన ఆమ్మాయిలు అయిన ఏడ్చే వారు బ‌ల‌హీనులు గా భావిస్తారు. అలాగే వీటిపై ప‌లు సామేత‌లు కూడా ఉంటాయి. ఏడ్చే మొగాడిని న‌మ్మ‌ద్దు అని అలాగే ఏడ్చే ఆడ‌దాన్ని కూడా న‌మ్మ వ‌ద్దు అని కూడా అంటారు. అలా ఏడ్వ‌టం పై ఉన్న హ‌ద్దు ల వ‌ల్ల చాలా మంది తమ బాధ‌ల‌ను మ‌న‌స్సు లోనే ఉంచు కుంటు చివ‌రికి ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నారు.



ఇలాంటి ఆత్మ‌హ‌త్య లను నివ‌రించ‌డానికి స్పెయిన్ ప్ర‌భుత్వం కాస్త భిన్నంగా ఆలోచించింది. అందులో భాగంగానే త‌మ దేశంలో కొన్ని న‌గ‌రాల్లోని ప్ర‌ధాన కూడ‌ళ్ల వ‌ద్ద ఈ క్ర‌యింగ్ సెంట‌ర్ లను ఏర్పాటు చేసింది. దీని వ‌ల్ల త‌మ దేశం లోని పౌరులకు స్ట్రేస్  త‌గ్గుతుంద‌ని ఆ దేశ ప్ర‌ధాన మంత్రి పెడ్రో శాంచెజ్ అన్నారు. అందు కోసం మాన‌సిక ఆరోగ్య సంర‌క్ష‌ణ డ్రైవ్ ను నిర్వ‌హిస్తున్నారు. దీని కోసం ఏకంగా 100 మిలియ‌న్ యూరోల‌ను ఖ‌ర్చు చేస్తున్నారు. వీటి తో త‌మ దేశంలో ఆత్మ హ‌త్య చేసుకుంటున్నవారి సంఖ్య ను త‌గ్గించాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నాని ప్ర‌క‌టించారు. అయితే స్పెయిన్ లో 2019 సంవ‌త్స‌రం లో 3671 మంది ఆత్మ హ‌త్య చేసుకున్నారు. అందులో చాలా మంది అధిక స్ట్రేస్ లో ఉండి ఆత్మ హ‌త్య చేసుకున్నవారే అని వారి ప్ర‌భుత్వ స‌ర్వే లు చెబుతున్నాయి. అలాగే స్పెయిన్ లో ప్ర‌తి 10 యువ‌కుల్లో ఒక‌రు మాన‌సిక ఆరోగ్య ప‌రిస్థితి తో బాధ ప‌డుతున్నార‌ని తెలుస్తొంది. అంటే స్పెయిన్ జ‌నాభాలో దాదాపు 5.8 శాతం మంది మాన‌సిక ఆందోళ‌న తో బాధ‌ప‌డుతున్నార‌ని అర్థం. వీటి ని త‌గ్గించ‌డానికే క్ర‌యింగ్ రూం ల‌ను ఏర్పాటు చేశారు.  





మరింత సమాచారం తెలుసుకోండి: