ఉరుకుల పరుగుల జీవితం..  ఎవరికి ఆరోగ్యం గురించి పట్టించుకునే సమయం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ఎంతో మంది గంటల తరబడి ఒకే దగ్గర కూర్చుని పనులు చేస్తున్నారు. తద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలను కూడా కొని తెచ్చుకుంటున్నారు. ఇక ఇటీవల కాలంలో ఎంతో మంది పనిలో నిమగ్నమై కనీసం మూత్ర విసర్జన చేయడానికి కూడా వెళ్లడం లేదు. మరి కొంత మంది పని ఒత్తిడి కారణంగా మూత్రాన్ని గంటల తరబడి ఆపుకుంటున్నారు. ఇక ఇలాంటివి చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను కూడా కొనితెచ్చుకుంటున్నారు.



 అంతే కాదు ఎంతో మంది అటు పబ్లిక్ టాయిలెట్స్ కూడా వినియోగించడానికి అంతగా ఆసక్తి చూపకపోవడంతో ఎక్కడికైనా బయటకి వెళ్ళినప్పుడు కూడా మూత్రం వచ్చినప్పటికీ గంటల తరబడి అలాగే ఆపుకోవడం వల్ల ఎన్నో రకాల సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారు.  ఇలా తరచుగా మూత్ర విసర్జన ఆపుకుంటే మాత్రం ఎన్నో రకాల అనర్దాలు జరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ మూత్రం వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా టాయిలెట్కు వెళ్లాల్సిందే అంటూ చెబుతున్నారు.



 తరచుగా మూత్రాన్ని ఆపుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవు అంటూ హెచ్చరిస్తున్నారు. అదే పనిగా మూత్రాన్ని ఆపడం వల్ల మూత్రాశయం సాగి పెద్దగా అవుతుండటం ఫలితం గా మూత్ర విసర్జనకు వెళ్తే మూత్రం పూర్తిగా బయటకు వెళ్ళదు అంటూ నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా మూత్రాన్ని పట్టి ఉంచే కండర వలయాలు కూడా సాగి వాటి సామర్థ్యం కూడా పూర్తిగా క్షీణించి దెబ్బ తింటుంది అని అంటున్నారు నిపుణులు. అంతేకాదు మూత్రాశయం లో హానికారక బ్యాక్టీరియా పెరిగే అవకాశం కూడా ఉంటుందని చెబుతున్నారు. ఇక ఇలా మూత్రాన్ని ఆపుకోవడం వల్ల మూత్రాశయం పెద్దగా అయి వెనక్కి వెళ్లి అటు కిడ్నీలను దెబ్బతీసే ప్రమాదం కూడా లేకపోలేదు అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: