ఈ మధ్య కాలంలో చాలా మంది మహిళలు పెళ్లి అయిన వెంటనే పిల్లలు వద్దనుకుని ఐ- పిల్ టాబ్లెట్ లను ఉపయోగిస్తున్నారు. నిజానికీ గర్భ నిరోధక మాత్రల వాడటం గురించి తెలిసినంతగా..ఈ మాత్రల పనితీరు గురించి అవగాహన మహిళల్లో చాలా వరకు ఉండదు. మరీ ముఖ్యంగా ఐ - పిల్‌ లాంటి ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్స్‌ను విచక్షణ రహితంగా వాడేస్తూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఐ - పిల్‌, గర్భనిరోధక పద్ధతులను పాటిస్తూ.. పొరపాటున ఎప్పుడైనా మర్చిపోయిన సందర్భంలో మాత్రమే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాడవలసిన మాత్ర.

నెలలో ఒకటి రెండుసార్లు మాత్రమే ఈ మాత్రలను ఉపయోగించవచ్చు..కానీ  అలా కాకుండా ఐ పిల్స్‌నే పూర్తిగా గర్భనిరోధక సాధనంగా ఉపయోగించడం  వల్ల శరీరంలో హార్మోన్ల హెచ్చుతగ్గులు ఏర్పడి,  నెలసరి క్రమం తప్పటం, గర్భం దాల్చలేకపోవటం, అబార్షన్ లాంటి సమస్యలకు దారితీయవచ్చు. ఒకవేళ మీరు అప్పటికే గర్భందాల్చి ఉండి, ఈ ఐ-పిల్‌ వాడితే దాని ప్రభావం కడుపులో పెరిగే  పిండం పై పడి జన్యుపరమైన సమస్యలతో బిడ్డ పుట్టే ప్రమాదం కూడా ఉంటుంది. నిజానికి ఐ - పిల్‌ అనేది.. పూర్తి స్థాయిలో మీ గర్భధారణని అడ్డుకోలేదు అని మాత్రం తప్పకుండా గుర్తుంచుకోవాలి.

ఒక్కోసారి మీ ప్రయత్నం విఫలం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. మరీ ముఖ్యంగా 25 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు వయసు కలిగిన మహిళలు మాత్రమే నెలకు ఒకటి లేదా రెండు సార్లు ఈ ఐ - పిల్ మాత్రలను గర్భ నిరోధకానికి ఉపయోగించవచ్చు. అంటే ఈ మధ్య వయస్సు కలిగిన వాళ్ళ శరీరంలో మాత్రమే అండాశయాలు పూర్తిగా తయారవుతాయి .ఇలాంటి వాళ్లు మాత్రమే ఉపయోగించవచ్చు ఈ మధ్య కాలంలో చాలా మంది 16 సంవత్సరాల వయసుకే అమ్మాయిలు ఈ మాత్రలను ఉపయోగించడానికి ముందుకొస్తున్నారు. ఇలా ఈ మాత్రలను మింగడం వల్ల భవిష్యత్తులో దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి.. కాబట్టి వీలైనంత వరకు వైద్యుల సలహాలు తీసుకుని గర్భనిరోధానికి ఇతరత్రా పరిష్కారాలు ఉంటే తెలుసుకొని పాటించడం ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి: