ఆవ నూనెతో బరువు తగ్గుతామని చాలామంది చెబుతూ ఉంటారు. అందులో నిజంగానే నిజం ఉందా ? అనే విషయం తెలుసుకుందాం. చాలామంది వంట కోసం ఉపయోగించడానికి రకరకాల నూనెలను వాడతారు. అయితే వీటి మధ్య తేడా తెలియని వారి మాత్రం నూనె రకాల గురించి ఆందోళన చెందుతారు. మీరు బరువు తగ్గడాన్ని లక్ష్యంగా చేసుకుంటే దాదాపు అన్ని నూనెలు అంత ఎఫెక్టివ్ కాదని కొందరు చెబుతుండగా, మీ బరువు తగ్గించే ప్రయాణంలో నూనె రకాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని మరికొందరు అంటున్నారు. అందులో ఆవ నూనె ఒక ఆరోగ్యకరమైన నూనె. బరువు తగ్గే ప్రక్రియలో ఇది ఎలా సహాయపడుతుందో తెలుసుకుందాం.

1. బరువు తగ్గడానికి మస్టర్డ్ ఆయిల్
ఆవాల నూనెకు జీవక్రియను వేగవంతం చేసే సామర్థ్యం ఉంది. ప్రధానంగా నియాసిన్, రిబోఫ్లావిన్ వంటి బి-కాంప్లెక్స్ విటమిన్లు ఉండటం వల్ల ఆహారాన్ని వేగంగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. ఈ ప్రక్రియ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. చాలా మంది ప్రజలు ఆవ నూనెకు దాని జిగట, ఘాటైన వాసన కారణంగా దూరంగా ఉంటారు. కానీ ఒకసారి సరిగ్గా వేడి చేస్తే ఆవ నూనె కూడా ఇతర నూనెల లాగే ఉంటుంది. ఈ నూనె ఒమేగా -3, ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు మరియు గుండెకు ఆరోగ్యకరమైన కొవ్వులకు మంచి మూలం. ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాల కలయిక ఆహారం రుచిని మెరుగుపరచడమే కాకుండా రక్తంలో కొవ్వు స్థాయిని తగ్గిస్తుంది. ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు శరీరంలో సహజంగా నిల్వ ఉన్న కొవ్వు వినియోగాన్ని మెరుగు పరుస్తాయి, ఇవి బరువు తగ్గడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

2. మస్టర్డ్ ఆయిల్ ప్రయోజనాలు
బరువు తగ్గడమే కాకుండా ఆవనూనెలో విస్మరించలేని అనేక ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. మస్టర్డ్ ఆయిల్‌లో మోనోశాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి గుండెకు మంచివి. మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడంలో సహాయపడతాయి. గ్లూకోసినోలేట్స్ ఉండటం వల్ల మస్టర్డ్ ఆయిల్‌లో క్యాన్సర్ నిరోధక గుణాలు కూడా ఉన్నాయి. కొలొరెక్టల్, గ్యాస్ట్రోఇంటెస్టినల్ వంటి క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆవాల నూనెను వంటకు కాకుండా అనేక ఇతర మార్గాలలో ఉపయోగిస్తారు. వేడి ఆవనూనెతో కీళ్లనొప్పి ఉన్నవారు క్రమం తప్పకుండా మసాజ్ చేయడం వలన నొప్పి బాగా తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: