ప్రాణాంతకం కాదు...కానీ మందు లేదు

కోవిడ్-19 వైరస్ ప్రపంచాన్ని వదలీ వదలకే ముందే మరో వైరస్ ... మరో వేరియంట్లు ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్నాయి. ఇవన్నీ కరోనా ప్రతి రూపాలు కాదు. వైరస్ అనేది ఏ రూపంలోనైనా రావచ్చు. మావవాళిని కబలించ వచ్చు. భారత దేశం స్వాతంత్య్ర అమృత మహోత్సవాలు జరుపుకుంటున్న వేళ  నాటి వైరస్ ఒకటి ఒక్కసారిగా భారత్ లో వెలుగు చూసింది. యావత్ ఆరోగ్య శాఖ యంత్రాంగాన్ని అలర్ట్ చేసింది. తానూ ఉన్నానని పించింది. అదే జికా వైరస్ .

కాన్పూర్ వైద్య ఆరోగ్య శాఖాధికారి నేపాల్ సింగ్ తెెలిపిన వివరాల ప్రకారం..   ఐఏఎఫ్ కు చెందిన ఓ అధికారి వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు.  ఇతనికి మెరుగైన చికిత్స అందించేందుకు జిల్లాలోని ఎయిర్ ఫోర్స్ ఆసుపత్రిలో  చేర్చారు. ఈ ఆఫీసర్ ను పరీక్షించిన వైద్యులు, అనికున్న లక్షణాల పై అనుమానం వ్యక్తం చేశారు.  జికా వైరస్ గా అనుమానించి, రక్త నమూనాలను సేకరించారు. వాటిని పూణే లోని ల్యాబ్ కు పంపారు.  ల్యాబ్ నుంచి వచ్చిన ఫలితాలలో పాజిటివ్ అని వచ్చింది. దీంతో వైద్యులు అలర్ట్  అయ్యారు. వైరస్ సోకిన వ్యక్తిని ఐసోలేషన్ లో ఉంచారు. అతనితో సన్నిహితంగా ఉన్న వారందరి  నుంచి రక్త నమూనాలను సేకరించి పూణేకు పంపారు. ఇదే లక్షణాలున్న వారందరినీ ఐసోలేషన్ లో ఉండాలని అధికారులు కోరారు.  తాజా పరిస్థితి పై కలెక్టర్ ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. జిల్లాలో జికా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన చర్యలపై చర్చించారు.
జిలా వైరస్ ఉత్తర ప్రదేశ్ లో తొలిసారి వెలుగు చూడ లేదు. మహారాష్ట్ర, కేరళలో ఈ ఏడాదిలో జికా వైరస్ ఉన్నట్లు వార్తలొచ్చాయి. అయితే అవి శాస్త్ర పరంగా నిర్దారణ కాలేదు. ఎడిస్ అనే దోమల నుంచి జికా వైరస్ వస్తుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ( డబ్ల్యూ.హెచ్.ఓ) ఎప్పుడో చెప్పింది. ఈ వైరస్ ను 1947 లోనే గుర్తించారు. అయితే దీని విశ్వరూపం ఉగాండా దేశంలో బైట పడింది. అది కూడా 1952లో. ఈపై వైద్య నిపుణలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి ఆందోళ నకు స్పష్టమైన కారణాలు చెప్పలేకున్నారు. జికా వైరస్ సాధారణంగా ఉంటుంది. పిల్లలకు ఈ వైరస్ సోకితే వారి ఎదుకుదలపై ప్రభావాన్ని చూపుతుంది. అంతే కాదు. పెద్దలపై చూపే ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది. లైంగిక సంపర్కం ద్వారా ఇది వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉండటం కూడా వైద్య నిపుణులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇది ప్రాణాంతకమైనది కాకపోవడం ఒకింత సంతోషించ తగ్గ పరిణామం. అయితే ఇంతకాలం ఈ జికా వైరస్ కు మందు కనుక్కోక పోవడం శోచనీయం.


మరింత సమాచారం తెలుసుకోండి: