కేరళలో కరోనా సహా జికా వైరస్ కూడా హడలెత్తించిన విషయం తెలిసిందే. దీనితో అది వ్యాపించకుండా కూడా చర్యలు తీసుకున్నారు. దేశంలో కూడా కరోనా తగ్గుతుందని అందరూ సాధారణ స్థితికి వచ్చేందుకు మొగ్గు చూపుతుండగా ఆయా దేశాలలో కరోనా విజృంభించడం చూస్తున్నారు. దీనితో ఇంకొన్నాళ్ళు కరోనా జాగర్తలు పాటించక తప్పదు. వాక్సిన్ వేసుకున్నవారు, వేసుకొని వాళ్ళు అందరూ ఈ జాగర్తలు పాటించాల్సిందే. అయితే జికా ఇప్పటివరకు కేరళ లో తప్ప ఎక్కడా బయటపడలేదు. కానీ తాజాగా ఉత్తరప్రదేశ్ లో మొదటి కేసు బయటపడింది. ప్రజలు ఇప్పుడిప్పుడే దేశీయ రవాణా ఉపయోగిస్తున్నందున జాగర్తలు మరీ కఠినంగా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇప్పటికే దేశంలో కరోనా సహా పలు ప్రాంతాలలో సీజనల్ వ్యాధులు కూడా బాగానే ప్రభావం చూపుతున్నాయి. అందుకే జికా వైరస్ తో కూడా జాగర్తలు వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తాజాగా యూపీలోని కాన్పూర్ లో ఎయిర్ ఫోర్స్ సిబ్బందికి ఈ వైరస్ సోకినట్టు అధికారులు నిర్దారించారు. బాధితుడి శాంపిల్స్ పరీక్ష కోసం పూణే పంపడం జరిగింది. ఆ ఫలితంలో అతడికి జికా సోకినట్టు వెల్లడైంది. దానితో అతను ఉంటున్న ప్రాంతం అంతటా శానిటైజ్ చేశారు. అలాగే అతడితో ఇటీవల సన్నిహితంగా ఉన్నవారిని 200 మంది వరకు గుర్తించి వారికి కూడా పరీక్షలు చేయించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా తగిన జాగర్తలు తీసుకుంటున్నారు ఆయా అధికారులు. యూపీ కంటే ముందుగా కేరళ, మహారాష్ట్రలలో జికా కేసులు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

ఈ వైరస్ ఏడిస్ దోమ వలన వస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. మొదట ఈ వైరస్ ను 1952లో ఉగాండా లో నివసించే మనుషులలో గుర్తించారు. అక్కడ ఉన్న అడవి పేరు జికా నే ఈ వైరస్ కు పెట్టారు. ఈ వైరస్ సోకిన వారికి జ్వరం, దద్దుర్లు, తలనొప్పి, కండరాల నొప్పి, నీరసం లాంటి లక్షణాలు ఉంటాయి. ఈ పరిస్థితి 2-7 రోజులపాటు ఉంటె వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. ఇది ప్రాణాంతకం కాకపోయినప్పటికీ, మందు లేకపోవటం వలన ముందస్తు జాగర్తలు అవసరం అని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. శృంగారం ద్వారా కూడా ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: