ప్రస్తుతం టెక్నాలజీ ఎంతగానో పెరిగిపోయింది.. మనిషి జీవన శైలి లో కూడా మార్పులు వచ్చాయి.. చేసే ఉద్యోగంలో కూడా మార్పులు రావడం గమనార్హం. అయితే ఇలా వచ్చిన మార్పులు మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగానే ఉన్నాయి అని చెప్పాలి. ప్రస్తుతం డబ్బు సంపాదించాలనే ఆశతో డబ్బు వెంట పరుగులు పెడుతున్న మనిషి అటు ఆరోగ్యానికి కనీసం పట్టించుకోవడం లేదు అని చెప్పాలి. అదే సమయంలో నేటి రోజుల్లో చేస్తున్న అన్ని రకాల ఉద్యోగాలు కూడా ఒకే చోట గంటల తరబడి కూర్చొని చేసే ఉద్యోగాలు కావడంతో ఇక అందరూ ఊబకాయులుగా మారిపోతున్నారు.


 అయితే నేటి ఉరుకుల పరుగుల జీవితంలో  సమయానికి ఆహారం తీసుకోవాలి అన్న విషయాన్ని మాత్రం అందరూ మర్చిపోతున్నారు అని చెప్పాలి. ఉద్యోగం వ్యాపారం చేస్తున్నవారు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడే ఆహారాన్ని తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఆహారం కోసం ప్రత్యేకంగా ఒక సమయాన్ని మాత్రమే కేటాయించడం లేదు. ఈ క్రమంలోనే ఎంతో మంది వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నేటి రోజులలో చాలామందిలో జీర్ణ సమస్యలు వస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలా జీర్ణ సమస్యలు రావడానికి ఆహారం విషయంలో సమయపాలన పాటించకపోవడం కారణం అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.



 అయితే ఇటీవలి కాలంలో బిజీ బిజీ లైఫ్ లో సమయానికి ఆహారం తీసుకోకుండా జీర్ణ సమస్యలతో సమస్యలతో బాధపడుతున్నవారు ఇక ఇలాంటి ఇబ్బందులు అన్నిటికీ కూడా పెరుగుతో చెక్ పెట్టవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.. పెరుగులో అనేక పోషకాలు ఉంటాయి.  కాల్షియం పొటాషియం మెగ్నీషియం పెరుగు ద్వారా లభిస్తాయి అని అంటున్నారు. ఇక ఇది జీర్ణక్రియను ఎంతో మెరుగుపరిచేందుకు ఉపయోగపడతాయని సూచిస్తున్నారు నిపుణులు. పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా డైజెస్టివ్ సిస్టం ను అటు రోగనిరోధక శక్తిని కూడా మెరుగు పరిచి ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది  అని సూచిస్తున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: