కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో వికారంగా అన్పిస్తుంది. వాంతులు వచ్చినట్టు అన్పించడం, కడుపు సమస్యలు, తల తిరగడం మొదలైన సమస్యలు ఉన్నాయి. వికారంగా అన్పిస్తే ఏమీ తినాలని అనిపించదు. అయితే వికారంగా అనిపించినప్పుడు కొన్ని ఇంటి చిట్కాలను కూడా ప్రయత్నించవచ్చు. వాంతులు రావడం చాలా భయంకరంగా ఉంటుంది. దాని వల్ల మూడ్ తో పాటు ఆరోగ్యంపై కూడా ఎఫెక్ట్ పడుతుంది. దానివల్ల తల నొప్పి వంటి ఇతర సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కడుపు నొప్పి కూడా అన్పిస్తుంది. ఈ ఆరోగ్య సమస్యలన్నీ కూడా కేవలం వాంతులు కారణంగానే అన్పిస్తుంది.

పుదీనా : జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో పుదీనా సహాయ పడుతుంది. పుదీనాలో ఉండే సహజ నూనె పొట్టకు విశ్రాంతినిచ్చి జీర్ణవ్యవస్థ నుండి గ్యాస్‌ను తొలగిస్తుంది. ఇది కాకుండా ఇది ప్రేగులను పని తీరును మెరుగు పరుస్తుంది. కడుపు ఉబ్బరం, విరేచనాలను తగ్గిస్తుంది. వికారంను తగ్గిస్తుంది. వికారం తగ్గాలంటే తాజా పుదీనా ఆకులను నమలవచ్చు లేదా ఒక కప్పు పుదీనా టీ తాగవచ్చు.

అల్లం : అల్లంలో ఫైటోకెమికల్స్, ఫైటోన్యూట్రియెంట్స్ ఉన్నాయి. ఇవి వికారం తగ్గించడంలో సహాయ పడతాయి.

ఆపిల్ : వికారంతో పాటు విరేచనాలు ఉన్న వారికి ఆపిల్ ఒక మంచి ఔషధం. ఇది కార్బోహైడ్రేట్లకు మంచి మూలం. కడుపుకు ఉపశమనఁ కలిగించి, ఉపయోగకరంగా ఉంటుంది. ఇది వికారం నుండి ఉపశమనం పొందడంలో సహాయ పడుతుంది.

నిమ్మరసం : నిమ్మరసంలో ఉండే న్యూట్రలైజింగ్ యాసిడ్ కారణంగా వికారంను నయం చేయడానికి నిమ్మరసం ఒక గొప్ప ఔషధం. తాజాగా పిండిన నిమ్మరసాన్ని నీటిలో కలపాలి. రోజంతా ఆ జ్యూస్ ను తాగుతూ ఉండాలి.

కొబ్బరి నీళ్లు : కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది మీ శరీరం నుండి అదనపు నీటిని బయటకు పంపుతుంది. ఇది కడుపుని శాంత పరుస్తుంది, సులభంగా జీర్ణమవుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: