దేశంలో కరోనా అనంతరం పరిస్థితులు చక్కబడుతున్నాయి అనుకుంటున్న ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. అయితే మరో రకం వైరస్ లేదా ఏదో ఒక రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యం ఇలా ఒకదాని వెంట మరొకటి దాడి చేస్తూనే ఉన్నాయి. ఒకదాని నుండి బయటపడ్డాం దేవుగా అనుకునే లోగానే మరొకటి వచ్చిపడుతూనే ఉన్నాయి. అసలే అంతంత మాత్రంగా తయారైన జనజీవనం ఈ వరదలు, సీజనల్ రోగాలతో ఇంకా క్షిణించిపోతుంది. ఇక దేశంలో అన్ని రాష్ట్రాలలో చల్లబడ్డ కరోనా ఒక్క కేరళలో మాత్రం కొత్త రకాలతో ఎప్పటికప్పుడు ప్రమాదభరితంగానే ఉంటుంది. ఒక దశలో దేశంలోని కేసులలో ఒక్క కేరళలోనే మూడు వంతులు ఉన్న సందర్భాలు కూడా లేకపోలేదు. ఆ స్థాయిలో అక్కడ కరోనా విజృంభణ కొనసాగింది. అనంతరం కూడా అదే పరిణామాలు, కాకపోతే కొత్త వైరస్ లేదా కొత్త వేరియంట్ అనే పేరు మార్పు తప్ప పరిస్థితి మాత్రం అలాగే కొనసాగుతూనే ఉంది.

కేరళలో కరోనా సహా దాని వేరియంట్లు, అనంతరం నిఫా అన్నారు, ఇప్పుడు తాజాగా న్యూరో వైరస్ అంటున్నారు. కరోనా సహా ఈ వైరస్ లు అన్నిటికీ ఔషదాలు లేనందున నివారణ మార్గాలు మాత్రమే అదుపు చేయగలవు. అందుకే అక్కడి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఆయా వైరస్ లు వెలుగు చూడగానే, చుట్టుపక్కల వాతావరణంలో దోమలు లాంటివి లేకుండా ఆయా రసాయనాలు చల్లుతూ చర్యలు తీసుకుంటున్నారు. తద్వారా ఆయా వైరస్ ల వ్యాప్తి ని అడ్డుకుంటున్నారు. తాజాగా బయటపడిన న్యూరో వైరస్ కూడా అటువంటిదే. ఆ కేసులు కూడా ఇప్పటికే ఏడు వరకు వెలుగు చూసినట్టు తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయి.

న్యూరో వైరస్ లక్షణాలు కూడా వాంతులు, విరోచనాలు, జ్వరం లాంటివి ఉంటాయని వైద్యారోగ్య శాఖ తెలిపింది. కలుషిత నీరు, ఆహారం ద్వారా ఈ వైరస్ మనుషులకు సోకె అవకాశం ఉంది. అధికారులు కూడా నిర్లక్ష్యం వహించకుండా, నివారణ మార్గాలు పాటించాలని ఉన్నతాధికారులు సూచించారు. కేరళ సరిహద్దు ప్రాంతాలుగా ఉన్న కర్ణాటకలో కూడా ఈ వైరస్ పై అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తాజాగా గుర్తించిన ఏడుగురు బాధితులలో ఆరుగురు మహిళలు కాగా, వారంతా 50-60 ఏళ్ళ వయసు వాళ్లు. వీరంతా ఎర్నాకులం, కొట్టాయం, కన్నుల్ జిల్లాలకు చెందిన వారుగా అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: