అగ్రరాజ్యం మరోసారి కరోనా భయంతో వణికిపోతోంది. మొదటి నుండి అధికంగా కరోనా తో బాధింపబడిన దేశంగా అమెరికా ఉంది. అక్కడ ప్రాథమిక హెచ్చరికలను లెక్కచేయకపోవడంతో మొదటి వేవ్ ప్రభావం బాగా కనిపించింది. ఒక్కసారి ప్రపంచం అమెరికాని చూసి ఉలిక్కిపడిందనే చెప్పాలి. అంతగా అగ్రరాజ్యం కరోనా తో వణికిపోయింది. అప్పటి నుండి ఇటీవలే కాస్త పరవాలేదు అనుకొంటుండగా, తాజాగా కొత్త వేరియంట్ల ప్రభావంతో మరోసారి అదే స్థాయిలో వ్యాప్తి కనిపిస్తుంది. యూరప్ దేశాలలో ఇప్పటికే తీవ్రంగా వ్యాపిస్తున్న కరోనా తో అమెరికా లో కూడా ఈ ప్రభావం పడింది. దీనితో మరోసారి అమెరికా లో మొదటి వేవ్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో నిర్లక్ష్యం వహించడం వలన వచ్చిందని తెలిసినప్పటికీ, ప్రజలు కూడా కాస్త కరోనా నెమ్మదించగానే పూర్తిగా సాధారణ స్థితికి వస్తుండటంతో ఇలాంటి ప్రమాదాలు వచ్చేస్తున్నాయి.

ఒక వాతావరణంలో నెమ్మదించింది అనుకున్న కరోనా మరో చోట విజృంభిస్తుంది, అలాగే ఎప్పటి కప్పుడు కొత్తగా రూపాంతరం చెందుతూ, కొత్త వేరియంట్లతో అంతుచిక్కకుండా తయారవుతుంది. ఇప్పటికే ఎన్నో వేరియంట్లతో అల్లాడించిన కరోనా తాజాగా దక్షిణ ఆఫ్రికాలో మరో కొత్త వేరియంట్ తో కాటేయడం మొదలుపెట్టింది. అయితే ఇది డెల్టా కంటే కూడా ప్రమాదకరం అని వైద్యులు సూచించడంతో ప్రపంచ దేశాలు మరోసారి జాగర్తగా ఉండాలని తమ ప్రజలకు హెచ్చరికలు జారీచేశారు. దీనితో న్యూయార్క్ లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు అధికారులు. అమెరికాలో ఈ తరహా కేసులు ఇంకా వెలుగు చూడనప్పటికీ, ముందస్తు జాగర్తలు తీసుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

అసలే కరోనా, అదికూడా శీతాకాలం, దానితో సీజనల్ వ్యాధులు, ఇలా ఒకదాని తరువాత మరొకటి వెంటాడుతుండటంతో అమెరికాలో ముందస్తుగానే ఈసారి జాగర్తలు తీసుకోవడం మొదలు పెట్టారు. ఇది ఆ దేశానికి మంచిదే. గతంలో లాగా నిర్లక్ష్యం వహించకుండా ముందుగానే చర్యలు తీసుకోవడం తో వాళ్లలో మార్పు వచ్చిందని సూచిస్తుంది. ఇప్పటికే న్యూయార్క్ లో రోజుకు 6వేలపైనే కేసులు నమోదు అవుతున్నాయి. ఇంకో కొత్త వేరియంట్ అది కూడా చాలా త్వరగా(కేవలం ఒకే రోజులో) వ్యాప్తి చెందేది కావడంతో ఈ ముందస్తు జాగర్తలు అందరు తీసుకోవడం మంచిది. ఈసారి అమెరికా ఒక అడుగు ముందే ఉండటం విశేషం. గత అనుభవం బాగా పాఠం నేర్పినట్టే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: