ఓమిక్రాన్... కొత్తగా పుట్టుకొచ్చిన వైరస్.  ప్రపంచ ఆరోగ్య సంస్థ. (డబ్ల్యూ హెచ్ ఓ) దీనిని వైవిద్యమైన వైరస్ గా పేర్కోంది. దీంతో ప్రపంచ దేశాలు అలర్ట్ అయ్యాయి. వివిధ దేశాధిపతులు తమ సిబ్బందితో సమావేశాలు నిర్వహించారు.  మందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.
దక్షిణాఫ్రికాలో పురుడుపోసుకున్నట్లు చెబుతున్న ఓమిక్రాన్  రకం పై భారత్ లో భయాందోళనలు నెలకొన్నాయి. సాక్షాత్తూ భారత ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ భారత్ లో ఓమిక్రాన్ కు అడ్డుకట్ట వేసే నిమిత్తం దాదాపు రెండుగంటలకు పైగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష తరువాత ప్రజల్లో భయాందోళనలు పెరిగాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓమిక్రాన్‌ను ఆందోళన కలిగించే వైవిధ్యమైన వైరస్ గా వర్గీకరించింది, అయితే ఈ వేరియంట్ గురించి ఇంకా పెద్దగా  ఎవరికీ తెలియదు. ఇది మరింత వ్యాప్తి చెందుతుందని,  రోగనిరోధక శక్తి పెంచుకోవడం తప్పనిసరి అని  తాజా  నివేదికలు పేర్కోంటున్నాయి.
 ఐసిఎం.ఆర్ నిపుణలు కొందరు ఈ కొత్త వేరియంట్ పై తమ అభిప్రాయాలను మీడియా తో పంచుకుంటున్నారు. ఈ వేరియంట్ పై  మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని మాత్రం వారు నొక్కి వక్కాణిస్తున్నారు.
కోవిడ్-19 కు అడ్డుకట్ట వేసేందుకు ఉద్దేశించిన  టీకాలు కోవాక్సిన్, కోవిషీల్డ్. ఈ రెండూ కూడా వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా నిలువరించాయి. ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటుంది. ఈ రెండూ కూడా  వేర్వేరు రకాల టీకాలు అని ఐసిఎం ఆర్ కు చెందిన డాక్టర్ సమీరన్ పాండా పేర్కోన్నారు. ఓమిక్రాన్ లో ఇప్పటి వరకూ గమనించిన నిర్మాణాత్మక మార్పుల పై ఈ టీకాలు ఏ మేరకు పనిచేస్తాయనే అంశం పై మరింత పరిశోధనలు  జరగాల్సి ఉందని  సమీరన్ పాండా  తెలిపారు. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న వైద్య సమాచారాన్ని బట్టి చూస్తే... భారత్ లో పెద్ద సంఖ్య లో వేసిన  ఎం.. ఆర్ ఎన్ ఏ రకం వ్యాక్సిన్ లు ఓమిక్రాన్ ను నిరోధించే శక్తి అంతగా ఉండక పోవచ్చని డాక్టర్ సమీర్ పాండా అభిప్రాయ పడ్డారు. కొత్త వేరియంట్ వేగంగా సంక్రమిస్తుందా ? ఇన్ ఫెక్షన్ లను వ్యాప్తి చేస్తుందా ? అన్న విషయం పై మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్ సమీర్ పాండా తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: