మనకు ప్రకృతిలో ఎన్నో రకాల కాయగూరలు లభిస్తున్న విషయం తెలిసిందే.. ముఖ్యంగా కాయగూరలలో విశిష్ట ఔషధ గుణాలు అలాగే పోషక విలువలు కలిగిన కూరగాయ ఏది అంటే అది కేవలం బోడ కాకరకాయ అని చెబుతారు. అప్పుడు అడవులలో ,తుప్పల్లో సహజసిద్ధంగా పెరిగే ఈ బోడ కాకరకాయ ఒక ఆరోగ్య ఖని అని చెప్పవచ్చు. ఇవి కాకరకాయ జాతికి చెందినవే .. అందుకే వీటిని ఆకాకరకాయలు అని అంటారు. ఈ వర్షాకాలంలో ఇవి ఎక్కువగా దొరుకుతాయి. ఈ బోడ కాకరకాయలను మనం తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువ.

ఇక వీటిని ఈ వర్షాకాలంలో తినడం వల్ల షుగర్ , బీపీ వంటి దీర్ఘకాలిక సమస్యలు దూరం అవుతాయి. మీరు కనుక జీర్ణక్రియ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లైతే ఈ బోడ కాకరకాయలు పుష్కలంగా తినవచ్చు. వీటిని తినడం వల్ల విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, పీచుపదార్థాలు పుష్కలంగా లభిస్తాయి. బోడ కాకర కాయ తినడం వల్ల వీటిలో ఉండే ఫోలేట్  శరీరంలో కొత్త కణాల అభివృద్ధికి తోడ్పడమే కాకుండా గర్భస్థ శిశువు పెరుగుదలకు తోడ్పడతాయి. డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నప్పుడు వీటిని తింటే రక్తంలో ఇన్సులిన్ స్థాయిని పెరిగి చక్కెర శాతాన్ని తగ్గిస్తాయి. ఫైటో న్యూట్రియంట్స్ కాలేయ కండరాల కణజాలానికి బలాన్ని చేకూర్చడానికి సహాయపడతాయి.

శరీరంలో ఏర్పడే వ్యర్ధాలను కూడా బయటకు పంపిస్తాయి. వీటిలో ఉండే విటమిన్ సి శరీరంలో ఇన్ఫెక్షన్లతో పోరాడే రోగాల బారిన పడకుండా కాపాడతాయి. అంతేకాదు ఈ బోడ కాకరకాయ లో ఉండే విటమిన్ ఏ వల్ల కంటి చూపుకు కూడా మేలు కలుగుతుంది. ఈ బోడ కాకర కాయలు తినడం వల్ల చర్మం మీద ముడతలు రాకుండా ఉంటాయని ఒక అధ్యయనంలో కూడా తేలిందట. మూత్రపిండాల సమస్య ఉన్న వాళ్లు ఈ బోడ కాకర కాయలు ఎంత ఎక్కువగా తింటే అంత మంచిది అని వైద్యులు కూడా చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: