దక్షిణాఫ్రికాలో వెలుగు చుసిన కొత్త వేరియంట్ మరోసారి ప్రపంచాన్ని జాగర్తపడేవిధంగా భయపెడుతుంది. అయితే గతంలో మాదిరి ఎవరూ మరోసారి ఇబ్బందులకు గురికావడానికి సిద్ధంగా లేరు. అందుకే ముందస్తు జాగర్తలు సిద్ధం అవుతున్నారు. మొదటిదశలో కరోనా ను నిర్లక్ష్యం చేసిన అమెరికా కూడా ముందుగానే జాగర్తలు పాటించడం మొదలుపెట్టింది. భారత్ లో కూడా ప్రధాని మోడీ ఆయా రాష్ట్రాల ప్రతినిధులతో కొత్త వేరియంట్ విషయంలో జాగర్తగా ఉండాలని సూచించారు. ఇలా ప్రతి దేశం ముందుగానే జాగర్తలు పాటిస్తూ, కరోనా వలన మరోసారి ప్రమాదకర పరిస్థితులు తెచ్చుకోకుండా ప్రయత్నిస్తున్నారు.

కొంత కరోనా శాంతించింది అని తెలియగానే, అంతర్జాతీయ ప్రయాణాలు చాలా దేశాలు కొనసాగిస్తున్నాయి. కానీ మళ్ళీ ఈ ప్రయాణాలతో ప్రపంచానికి కొత్త వేరియంట్ పాకిపోతుందనే ఉద్దేశ్యంతో మరోసారి ఈ ప్రయాణాలపై సమీక్షించుకుంటున్నాయి ఆయా దేశాలు. ఏది ఏమైనా కాస్త ప్రమాదకరమైన వేరియంట్ అని తెలియగానే అన్ని దేశాలు ముందస్తు జాగర్తలు పాటిస్తుండటం ద్వారా వ్యాప్తి దాదాపు తగ్గిపోతుంది. తద్వారా ఆ వేరియంట్ ప్రభావం కూడా అంతగా ఉండదు. అయితే ఈ ప్రభావం ఎంత కాలం కొనసాగుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సిందే. ఒకసారి వ్యాప్తి చెందితే మాత్రం దీనితో ప్రమాదం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇప్పటికే అన్ని దేశాలకు హెచ్చరికలు జారీచేసింది.

ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ ప్రయాణాలకు ఇటీవలే పచ్చ జెండా చూపించిన భారత్ కూడా మరోసారి దానిపై నిర్ణయం వెనక్కు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కొన్ని దేశాలకు మినహా ప్రస్తుతం ఈ ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నెలలోనే పూర్తిగా ఈ నిబంధనలు సడలించాలి అనుకోగానే, కొత్త వేరియంట్ వార్తలు వచ్చేశాయి. దీనితో మరోసారి వాయిదా తప్పదని తెలుస్తుంది. అదే కాస్త మేలు చేయగలదు. పొరపాటున ఆయా దేశాల నుండి కరోనా భయంతో ఆ ప్రభావం లేని దేశాలకు వెళ్లాలని ప్రజలు ప్రయాణాలు పెట్టుకొనే అవకాశాలు ఉంటాయి, అలాంటి వారికి తెలియకుండానే ఈ రకం అప్పటికే ఉండి ఉంటె, ఆ ప్రమాదం అంతటితో ఆగడు. అసలే కొత్త రకం వ్యాప్తికి ఒక్కరోజు చాలు అంటున్నారు నిపుణులు. ప్రయాణాల కంటే, ఆరోగ్యమే ముఖ్యం.

మరింత సమాచారం తెలుసుకోండి: