నిమ్మరసం తాగితే బరువు తగ్గుతారంటూ వందల కొద్దీ కథలు కనిపిస్తాయి. బరువు తగ్గడానికి ప్రతిరోజూ ఉదయం నిద్రలేచి, ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగమని సలహా కూడా ఇస్తారు. ఒక ఆలోచన ప్రజల దృష్టిలో విస్తృతంగా వ్యాపించి ఉంటే దానికి బలమైన శాస్త్రీయ కారణం కూడా ఉండాలి. అందులో నుంచి పుట్టిన ప్రశ్నే నిమ్మరసం బరువు తగ్గిస్తుందా ? కొవ్వునా ?... నిమ్మకాయ నీరు త్రాగటం నిజంగా బరువు తగ్గడానికి సహాయ పడుతుంది. కానీ ఆహారం, బరువు తగ్గడం, హార్మోన్లపై ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన వందలాది వైద్య పరిశోధనలలో లెమన్ వాటర్ తాగడం వల్ల బరువు తగ్గుతుందని ఒక్క పరిశోధన కూడా లేదు.

బరువు తగ్గడానికి సిట్రిక్ యాసిడ్ కలిగిన ఆహారాల సంబంధం ఏమిటి ? అనే దానిపై దృష్టి సాటించారు శాస్త్రవేత్తలు. ఈ అధ్యయనం ప్రకారం నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది. ఇది కొవ్వును కరిగించడానికి పని చేస్తుంది. దీనితో పాటు నిమ్మకాయ మన రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. యూనివర్శిటీ ఆఫ్ బార్సిలోనాకు చెందిన పరిశోధకులు సిట్రిక్ యాసిడ్ కాలేయం చుట్టూ ఉన్న కొవ్వును కరిగించడంలో, పిత్తాశయం సాఫీగా పని చేయడంలో సహాయపడుతుందని కనుగొన్నారు. మూడు నెలల పాటు రోజూ నాలుగు పెద్ద నిమ్మకాయల రసాన్ని సేవించే వ్యక్తుల కొవ్వు కాలేయంలో మార్పులు గమనించారు. దీనితో పాటు జీర్ణవ్యవస్థ లో సానుకూల మార్పులు, కొవ్వును కాల్చే హార్మోన్ ను సక్రియం చేయడంలో సిట్రిక్ యాసిడ్ కీలక పాత్ర పోషించిందని తెలుస్తోంది. సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉండే నిమ్మకాయ పరోక్షంగా కొవ్వును కరిగించడంలో సహాయ పడుతుందని పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు. కాబట్టి నిమ్మకాయ బరువును తగ్గించదు. కానీ కొవ్వును మాత్రం కరిగిస్తుంది.  కాబట్టి ఇప్పటి నుంచి స్లిమ్ గా కన్పించాలనుకునే వారికీ లెమన్ జ్యూస్ బెస్ట్.



మరింత సమాచారం తెలుసుకోండి: