ప్ర‌జ‌ల ఆహార అల‌వాట్ల కార‌ణంగా అనేక ఆరోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయి. అందులో ఊబ‌కాయం చాప‌కింద‌నీరులా పాకుతోంది. దేశంలో ఊబ‌కాయుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. అయిదేళ్ల పిల్ల‌ల్లో ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా ఉంద‌ని జాతీయ ఆరోగ్య కుటుంబ స‌ర్వే వెల్ల‌డించింది. 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వ‌య‌సుకు మించిన బ‌రువు పిల్ల‌లో పెరుగుద‌ల న‌మోద‌యింద‌ని తెలిపింది. దీనికి ప్ర‌ధాన కార‌ణం శారీరిక శ్ర‌మ లేక‌పోవ‌డం, ఆహార నియామాలు సరిగ్గా పాటించ‌క‌పోవ‌డ‌మేన‌ని నిపుణులు చెబుత‌న్నారు. పిల్ల‌ల్లోనే కాదు మ‌హిళ‌ల్లోనూ ఊబ‌కాయం పెరుగుతుంద‌ని వెల్ల‌డించింది.


  తాజా స‌ర్వే ప్ర‌కారం.. మ‌హారాష్ట్ర, గుజ‌రాత్‌, త్రిపుర‌, ల‌క్ష్య‌ద్వీప్‌, జ‌మ్మూక‌శ్మీర్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఢిల్లీ, బెంగాల్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్, ల‌ద్దాఖ్ లో ఐదేళ్లు ఉన్న పిల్ల‌ల్లో అధిక బ‌రువు ఉన్న వారి సంఖ్య పెరిగింది. గోవా, త‌మిళ‌నాడు, దాద్రాన‌గ‌ర్ హ‌వేలి, ద‌మ‌న్ అండ్ డయ్యూ దీవుల్లో మాత్ర‌మ ఐదేళ్ల‌ల్లో పిల్ల‌ల్లో ఊబ‌కాయం త‌గ్గింద‌ని వెల్ల‌డ‌యింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మ‌హిళా స్థూల‌కాయులు, పురుషుల్లో ఊబ‌కాయులు పెరిగారు. చిన్నారులు, పెద్ద‌వారిలో బ‌రువు పెర‌గ‌డానికి శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డం, ఆహార‌ప‌ద్దతులే కార‌ణం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.


 గ‌త 15 ఏళ్ల‌లో ఆర్థిక స్థిర‌త్వం కార‌ణంగా ప్ర‌జ‌ల ఆదాయాలు పెరిగాయి. ఆర్థికంగా ఎద‌గ‌డ‌మే భార‌తీయుల్లో ఊబ‌కాయం పెర‌గ‌డ‌మే కార‌ణం అని అంద‌రికీ తెలిసిందే. క‌రోనా ముందుతో పోలిస్తే ఆ త‌రువాత పిల్లల్లో ఎక్కువ మంది ఊబ‌కాయం భారిన ప‌డిన‌ట్లు అమెరికా వైద్య సంఘం అధ్య‌యనంలో తేలింది. గ‌డిచిన 50 సంవ‌త్స‌రాల్లో ఊబ‌కాయం మూడు రేట్లు పెరిగిన‌ట్టు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ గ‌ణాంకాలు వెల్ల‌డిస్తున్నాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా అధికంగా చైనాలో పిల్ల‌లు అధికంగా ఊబ‌కాయంతో బాధ‌ప‌డుతున్నారు.



ఆ త‌రువాతి స్థానం భార‌త్ దేన‌ని అధ్య‌య‌నాలు వెల్ల‌డిస్తున్నాయి. దేశంలో ప్ర‌తి 100 మ‌వందిలో న‌లుగురు పిల్ల‌లు ఊబ‌కాయంతో బాధ‌ప‌డుతున్న‌ట్టు స‌ర్వే తెలిపింది. పిల్లల్లో తొలిద‌శ‌లోనే ఊబ‌కాయం నివారించ‌క‌పోతే దుష్ప్ర‌భావాలు ఉంటాయ‌ని హెచ్చ‌రిస్తున్నారు. కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న జంక్‌ఫుడ్స్‌, ఫాస్ట్ ఫుడ్‌, కూల్‌డ్రింక్స్ కు పిల్ల‌ల‌ను దూరంగా ఉంచాలి. అలాగే, వారితో ఆట‌లు ఆడించాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: