మానవ జీవితం ఎంతో విలువైనది. దాన్ని మనం ఏ విధంగా మలచుకుంటే ఆ విధంగానే మన జీవితాన్ని గడపవచ్చు. అలాంటి స్వచ్ఛమైన మానవ జీవితంలో ఆడ మగ సంబంధ కలయిక అనేది సురక్షితంగా ఉంటేనే ఆ జీవితం అనేది సాఫీగా సాగుతుంది. ప్రస్తుతం అటువంటి మోడ్రన్ కల్చర్ తో పాటు, టెక్నాలజీ కూడా పెరిగింది. దీనికి తోడుగా  అనేక ఆరోగ్య సమస్యలు, అంటు వ్యాధులు, రోగాలు కూడా పెరిగిపోయాయి. మనం ఎంత ఫాస్ట్ గా అప్డేట్ అవుతున్నామో అంత ఫాస్ట్ గా నాశనం కూడా అవుతాం. అలాంటి కొన్ని సురక్షితం కాని  అక్రమ సంబంధాల వల్ల మన నిండు జీవితాన్ని చేతులారా పాడు చేసుకుంటున్నాం.

 ఎయిడ్స్ అనే మహమ్మారి బారిన పడి మసకబారి పోతున్నాం. ఈ రోజు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా గురుగ్రామ్ చెందినటువంటి హైజిన్ బ్రాండ్ అయినా  సేఫ్ ఫిమేల్ కంపెనీకి చెందిన కండోమ్  తయారీ సంస్థలో డొమినా నిర్వహించిన ఒక సర్వేలో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. అవేంటో తెలుసుకుందామా..? మన భారతదేశంలో వచ్చేటువంటి 10 సంవత్సరాలలో దాదాపు 75 లక్షల మంది ఎయిడ్స్ సంబంధించినటువంటి వ్యాధి బారిన పడి  మరణించే అవకాశం ఉందని ఈ యొక్క సర్వే ద్వారా తెలియజేసింది. ఈ విపత్తును నియంత్రణ చేసేందుకు ఇప్పటి నుంచే తగిన చర్యలు తీసుకోవాలని, ఎయిడ్స్ పై ప్రజలలో అవగాహన కల్పించాలని ఈ సంస్థ మరోసారి గుర్తు చేసింది. భారతదేశంలో 57 శాతం మంది కండోమ్ వంటి సురక్షితమైన గర్భ నిరోధక లను ఉపయోగించడం లేదని, దీంతో హెచ్ఐవి ఎయిడ్స్ లాంటి రోగాలు త్వరగా వచ్చేందుకు దారిని ఇవ్వవచ్చని సర్వే ద్వారా తెలిసింది. అత్యధికంగా వీటిని ఉపయోగిస్తున్న నగరాల్లో ఢిల్లీ రాష్ట్రం అగ్రస్థానంలో ఉండగా, చిట్టచివరి స్థానంలో మాత్రం అహ్మదా బాద్ నిలిచింది. అలాగే బరేలీ, భోపాల్,  బెంగళూరు, అగర్తల, చెన్నై, పాట్నా, ముంబై  విశాఖపట్నం వంటి నగరాల్లోని దాదాపు 25481 మందిపై ఈ సర్వే చేసి వివరా లు అడిగి తెలుసుకున్నారు అని తెలుస్తోంది. ఒక డిల్లీ రాష్ట్రం నుంచే దాదాపు 5 వేల మంది నుంచి వివరాలు సేకరించారు.

 ఈ సర్వేలో పాల్గొన్నటువంటి బృందం అనేక ప్రశ్నలను వారిని అడిగింది. మీరు ఇలాంటి కండోమ్ ఇష్టపడతారు..? అనే ప్రశ్నకు 56 శాతం మంది  మేల్ కండోమ్ లేదా ఎక్స్టర్నల్ కండోమ్ ను ఇష్టపడతానని తెలియజేశారు. ఇందులో 80 శాతం మంది ఫిమేల్ కండోమ్ లేదా, ఇంటర్నల్ కాండోమ్ వాడతామని, ఐదు శాతం మంది ఫిమేల్ కండోమ్ అంటే ఏమిటో కూడా తెలియదని ఆశ్చర్యకరమైన సమాధానం చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: