వాక్సినేషన్ పై దేశంలో ఇంకా విషప్రచారం చేస్తూనే ఉంది విపక్షం. అందుకే తాజా పరిస్థితులలో మరింతగా టీకా కార్యక్రమం జరగాల్సింది నిదానంగా కొనసాగుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఈ తరహా పరిస్థితి ఉన్నట్టుగా తాజా గణాంకాలు చెపుతున్నాయి. మొదటి డోసులో కాస్త ముందున్నప్పటికీ రెండో డోసులో ఆయా రాష్ట్రాలు 30 శాతం దాటలేకపోతుండటం అందరికి అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అసలు అయితే ఈ టీకా ప్రారంభ సమయంలోనే అదంతా ఒట్టి నీరు అని కాంగ్రెస్ వర్గాలు దేశీయ టీకాపై విమర్శలు చేశారు. అయినా రెండో వేవ్ లో పరిస్థితి విషమించడంతో ప్రజలు ముందుకు రావడంతో పరిస్థితి కొంత మెరుగుపడింది. మళ్ళీ ఇప్పుడు పరిస్థితి కాస్త ఆందోళన కరంగా కనిపిస్తుండటంతో ఈ విషప్రచారం ప్రారంభింస్తున్నారు.

కొత్త వేరియంట్ సందర్భంగా దేశీయంగా ఆయా రాష్ట్రాలలో టీకా కార్యక్రమాన్ని మరోసారి ఉదృతం చేశారు. ముందుగా దీనిపై కాస్త భయబ్రాంతులకు లోనైనప్పటికీ, టీకా వేసుకున్న వారికి కాస్త ప్రభావం తక్కువే అనేది తేలడంతో, ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. దేశంలో పరిస్థితి విషమం కాకూడదు అని ముందస్తు జాగర్తలు పాటిస్తూ, అందరికి అదే జాగర్తలు పాటించాలని చెప్తూ ఉండాల్సిన పార్టీలు ఇప్పటికి బుద్ది మార్చుకోకుండా విషప్రచారం చేయడం శోచనీయం.

ఇలాంటి పరిస్థితులు మార్చాలనే, బీజేపీ తాజాగా ఆయా రాష్ట్రాలలో వాక్సినేషన్ కార్యక్రమం ఎంతవరకు జరుగుతుంది అనేదానిపై లెక్కలను విడుదల చేసింది. తద్వారా ఎవరి వలన టీకా కార్యక్రమం మందకొడిగా సాగుతున్నది ప్రజలకు తెలుస్తుందన్నది ఆ పార్టీ వ్యూహం. ఆయా కాంగ్రెస్ పాలిత ప్రాంతాలలో మొదటి డోసు లెక్కలు 70-80 శాతం వరకు ఉంటె, రెండో డోసు 30 శాతం దాటలేదు. బీజేపీ పాలిత ప్రాంతాలలో మొదటి డోసు 80-85 శాతం వరకు ఉంటె, రెండో డోసు 40-45 శాతం వరకు ఉన్నది. కావాలని ఈ సమయంలో టీకా కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేసి దాని వలన వచ్చే ప్రమాదకర పరిస్థితి కేంద్ర పై రుద్దాలని విపక్షాలు రాజకీయం చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: