మనం ఎప్పుడైనా సాయంత్రం అలా బయటకు వెళ్ళినప్పుడు రోడ్డుకు ఇరువైపులా, పిల్ల కాలువలు సైడు , పొలాల గట్ల పైన మొక్కలు దర్శనమిస్తూ ఉంటాయి. ఈ మొక్క యొక్క పూలు పసుపు , రోజా పూల వర్ణంలో మనకు.. వీటి పూలు విరబూస్తూ చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటాయి. శాస్త్రీయపరంగా ఈ మొక్కల యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా నివ్వెర పోవాల్సిందే.. వెర్బినేసి కుటుంబానికి చెందిన ఈ మొక్క ను తలంబ్రాలు మొక్క అని కూడా పిలుస్తూ ఉంటారు. సుమారుగా 150 రకాలకు పైగా జాతుల ఉన్న ఈ మొక్కలను కొన్ని ప్రదేశాలలో లంబాడి మొక్కగా కూడా పరిగణిస్తూ ఉంటారు.


ఈ లంబాడి మొక్క యొక్క ఆకులను ఉపయోగించి మనం చర్మ సంబంధిత వ్యాధులను దూరం చేసుకోవచ్చు.. ఉదాహరణకు గజ్జి, తామర , దద్దుర్లు వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ మొక్క మంచి ఉపశమనం. ఈ మొక్క లో ఉండే క్రిమినాశక.. యాంటీ మైక్రోబయాల్ గుణాలు కలిగి ఉండడం వల్ల గాయాలు త్వరగా మానడానికి సహాయపడతాయి. ఎప్పుడైనా , ఎవరైనా సరే పొలాలలో పని చేస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా గాయాలు తగిలితే ఈ ఆకుల రసాన్ని పట్టిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఈ జనరేషన్ యువతకి కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు ఎక్కువ అవుతున్నాయి.. అప్పట్లో అయితే 60 సంవత్సరాలు దాటితే తప్ప ఇలాంటి సమస్యలు ఎదురయ్యే వి కాదు.



నివసించే పరిసరాలు, జీవనశైలి, ఆహారపు అలవాట్లు వంటి ఎన్నో కారణాల వల్ల కూడా అతి చిన్న వయసులోనే ఇలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరైనా కాళ్లు , కీళ్ల నొప్పులతో బాధ పడుతున్నారో అలాంటి వాళ్ళు ప్రతిరోజు రాత్రిపూట ఈ ఆకులను .. ఆముదం నూనె లో మెత్తగా నూరి నొప్పి ఉన్నచోట ఆ పేస్ట్ ను పెట్టి గుడ్డతో కట్టడంవల్ల.. ఉపశమనం కలుగుతుంది.. అంటే ఈ పద్ధతిని మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒక 30 రోజుల పాటు పాటించాల్సి ఉంటుంది. గొంతు నొప్పి, గొంతులో గర గర, అజీర్తి, కడుపు నొప్పి, జనాలు ఇలా అన్నింటిని దూరం చేస్తుంది ఈ మొక్క.

మరింత సమాచారం తెలుసుకోండి: