సాధారణంగా విదేశీ ప్రయాణాలు అంటేనే ఎయిర్ పోర్టులలో ఆ డాకుమెంట్ ఈ డాకుమెంట్ అంటూ పలు రకాల తనిఖీల అనంతరమే లోనికి అనుమతి ఉంటుంది. అలాంటిది కరోనా వచ్చిన తరువాత ఈ బాధ మరింతగా ఎక్కువ అయిందనే చెప్పాలి. ఉద్యోగ నిమిత్తం మొన్నటివరకు విదేశాలలో ఉన్నవారు, కరోనా దెబ్బతీయ ఇంటిబాట పట్టారు. అప్పుడు తిప్పలు చెప్పనలవి కావు. ఇక కాస్త తగ్గింది కరోనా అన్న సమయంలో మరోసారి కార్యాలయాలకు వెళ్లాల్సిన వారికి కరోనా పరీక్షలు అని పలు తనిఖీలు ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. ఇక పొరపాటున కరోనా అంటే వెంటనే 7-14 రోజుల క్వారంటైన్ తప్పింది కాదు. కరోనా సమయంలో అయితే వైరస్ వచ్చినా లేకున్నా కూడా ఈ క్వారంటైన్ తప్పనిసరి చేశారు. ఎందుకంటే పొరపాటున వైరస్ ఆ వారంలో బయటపడితే అనే ఉద్దేశ్యంతో క్వారంటైన్ నిబంధన కఠినతరం చేయబడింది. గతంలో ఎయిర్ పోర్టు కు వెళితే గంట లేదా గంటన్నర తనిఖీ ఉండేది, కరోనా తరువాత 6 గంటల ముందు వెళ్లాల్సి వస్తుంది. అప్పటికి ఎక్కాల్సిన విమానం వాయిదా పడకుండా ఉంటె అదృష్టం.

తాజాగా మరోసారి కొత్త వేరియంట్ బయపెడుతుండటంతో ఇదే తరహా నిబంధనలు అమలు చేస్తున్నారు అంతర్జాతీయ విమానాశ్రయాలు. ఆయా దేశాల నుండి వచ్చిన వారికి కరోనా ఉన్నా లేకున్నా కూడా క్వారంటైన్ నిబంధనను ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. ఇది మంచికే అనేది తెలిసినప్పటికీ, ఆయా ప్రయాణికులకు కాస్త చిరాకుగా ఉండటం సహజం. పొరపాటున వాళ్లలో ఒకరికి ఎయిర్ పోర్టులో నెగటివ్ వచ్చి, అనంతర వారంలో కొత్త వేరియంట్ బయటపడితే ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అందుకే ముందస్తు జాగర్త కోసం ఈ కఠిన నిబంధనలు అమలు చేయక తప్పదు.

అందుకే భారత్ లో కూడా అన్ని ఎయిర్ పోర్టులలో కూడా(ఎక్కడెక్కడ విదేశీయులు వచ్చే అవకాశాలు ఉన్నాయో అక్కడక్కడ) ప్రయాణికులకు 14 రోజుల క్వారంటైన్ నియమం అమలు కు ఆదేశాలు ఇవ్వబడ్డాయి. అంటే కరోనా ఉన్నా లేకున్నా కూడా ఖచ్చితంగా క్వారంటైన్ 14 రోజులు ఉండాల్సిందే. ఈ రెండు వారాల సమయంలో ఎవరిని కలవడం కానీ, ఎక్కడికైనా వెళ్లడం కానీ చేయడం కుదరదు. పనుల మీద అటుఇటు తిరుగుతున్న వాళ్లకు ఇలాంటివి కష్టం కావచ్చు గాని, ఆరోగ్యం అంతకంటే ప్రదానం కాబట్టి, తమకోసం, తమ వాళ్ళ కోసం ఈ నిబంధన పాటించక తప్పదు అనేది అందరు అర్ధం చేసుకోవాల్సి ఉంది. ఇప్పటికే కొత్త వేరియంట్ భారత్ లో ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆరోగ్యశాఖ హెచ్చరించింది కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి: