ఇటీవల దక్షిణాఫ్రికాలో బయటపడిన కొత్త కరోనా వేరియంట్ త్వరగా వ్యాప్తి చెందుతుంది అనే ఉద్దేశ్యంతో వెంటనే ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలకు హెచ్చరికలు జారీచేసింది. దీనితో ఆయా దేశాలు ఇప్పటికే తమ తమ ముందస్తు జాగర్తలు తీసుకోవడం మొదలుపెట్టారు. అయినా అంత త్వరగా అంతర్జాతీయ, జాతీయ ప్రయాణాలు ఆపడం సాధ్యం కాదు కాబట్టి ప్రయాణికులు ఆయా దేశాల నుండి వస్తూనే ఉన్నారు. దీనితో కొత్త వేరియంట్ వ్యాప్తి కాస్త జరుగుతూనే ఉంది. అందుకే ఇప్పటికే 30 దేశాలలో దాదాపు నాలుగు వందల కేసుల వరకు బయటపడ్డాయి. భారత్ లో కూడా మూడు కేసులు నమోదు అవడంతో ఆయా ప్రాంతాలలో కఠిన నిబంధనలు అమలులోకి తెచ్చేశారు.

ఒకపక్క కొత్త వేరియంట్ తో అందరు భయపడుతూనే మరోపక్క పాత వేరియంట్ ల తో బాధితులు ఎక్కువ మంది మృత్యువాత పడుతున్నట్టు నివేదికలు తెలుపుతున్నాయి. ఏ వేరియంట్ అయినప్పటికీ ముందస్తు జాగర్తలు పాటించడం వలన కరోనా నుండి బయటపడవచ్చు. అయినా అమెరికా, ఫ్రాన్స్ లాంటి దేశాలలో సాధారణ కరోనా బాధితులు పెరుగుతూనే ఉన్నారు, అలాగే రోజురోజుకు మృతుల సంఖ్య కూడా భారీగానే పెరిగిపోతుండటం అందరిని భయాందోళనలకు గురిచేస్తుంది. దాదాపుగా కరోనా తగ్గుముఖం పట్టింది అనుకుంటున్న సమయంలో యూరప్ దేశాలలో మరోసారి కరోనా విజృంభణ ప్రారంభించింది.

అది ఆయా ప్రాంతాల వాతావరణ ప్రభావం అనుకుని సరిపెట్టుకుంటున్నంతలో దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ వెలుగు చూడటం జరిగింది. ఇలా కరోనా ఏదో ఒక రూపంలో ప్రపంచ దేశాలను భయపెడుతూనే ఉంది. కాస్త పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది అనుకునేలోపే ప్రజలు కూడా కరోనా నియమాలు పాటించకుండా యధావిధిగా జీవనం సాగిస్తున్నారు. దీనితో కరోనా వ్యాప్తి జరిగి, ఇలాంటి ప్రమాదాలు వచ్చిపడుతున్నాయని వైద్యశాఖ అంటుంది. ఏదిఏమైనా కరోనా మరణాలు పెరగడం మరోసారి ప్రమాద ఘంటికలు మోగించడమే అనుకోవాలి. ఒక్క అమెరికాలోనే 130000 కేసులు, ఫ్రాన్స్ లో 40000 కేసులు చొప్పున ఒక్క రోజులో నమోదు అవడం జరిగింది. ఇవన్నీ సాధారణ కరోనా వైరస్ మృతులే. రెండు డోసులు వాక్సిన్ వేసుకున్న వారికి ప్రస్తుత వేరియంట్ వలన కూడా ప్రమాదం ఉండబోదని, అయితే కరోనా నిబంధనలు పాటిస్తూ జీవనం సాగించాల్సిందే అని వైద్యులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: