కరోనా వచ్చినప్పటి నుండి అనేక సారు మార్పులు చెందుతూనే ఉంది. అందులో డెల్టా రకం బాగా భయపెట్టింది. దానిని కూడా అధిగమించేశాం అని అనుకునే లోపు దక్షిణాఫ్రికాలో మరో కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. అది డెల్టా కంటే గొప్పగా ప్రమాదకరం అని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. దీనితో అందరు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు అనే చెప్పాలి. ఆయా దేశాలు కూడా కరోనా నెమ్మదించడంతో సాధారణ జీవనం గడిపేస్తున్న తమతమ ప్రజలకు కొత్త వేరియంట్ పై హెచ్చరికలు జారీచేశాయి. దీనితో మరోసారి కరోనా భయంలో ప్రపంచం వణికిపోతోంది. ఒకసారి వచ్చి చాలా చోట్ల తగ్గుముఖం పట్టిన దాఖలాలు ఉన్నాయి. మొదట వచ్చినప్పటి నుండి ఇంకా తగ్గుముఖం పట్టని దేశాలు ఉన్నాయి. అవన్నీ ఇంకా వణికిపోతున్నాయి. కాస్త తగ్గినట్టుగా కనిపిస్తున్న దేశాలలో ప్రముఖంగా యూరప్ దేశాలలో మరోసారి కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.

మొదటి దశలో టీకాలు అందుబాటులో ఉన్న ముచ్చటే లేదు. తదనంతరం కాస్త అందుబాటులోకి వచ్చినప్పటికీ, దానిపై పలు అపోహలు, అనుమానాలు. అంతటా రెండో వేవ్ ముంచుకురావడంతో అందరు ధైర్యం చేసి వాక్సిన్ కోసం పరుగులు పెట్టారు. ఒక దేశంలో వాక్సిన్ రెండు డోసులుగాను, చాలా కొద్ది దేశాలలో ఒక్క డోసుగాను వేస్తున్నారు. అలా ముందు పెద్దలకు, వైద్య సిబ్బందికి ఈ టీకాలను అందించారు. ప్రజలలో అపోహలు పోగొట్టడానికి పలువురు ప్రముఖులు కూడా టీకాను తీసుకోవడం జరిగింది. దీనితో ప్రజలు ముందుకు రావడం ఎక్కువ అయ్యింది. అప్పటికి ఉత్పత్తి పెద్దగా లేకపోవడం మరోసమస్యగా పరిణమించింది. భారత్ లాంటి దేశాలలో అయితే అదొక సమస్య అయిపోయింది. దీనితో ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుకుంటూ పోయింది భారత్.

ఇలా ప్రస్తుతం 125 కోట్ల డోసులను భారత  ప్రభుత్వం ఆయా వర్గాల వారికి అందించింది. ఇటీవల కరోనా తగ్గుముఖం పట్టడంతో కాస్త వాక్సినేషన్ ప్రక్రియ కూడా నెమ్మదించిన మాట వాస్తవం. కానీ ప్రస్తుత కొత్త వేరియంట్ ప్రభావంతో ఈ ప్రక్రియ మరోసారి వేగాన్ని పుంజుకోవడం జరిగింది. మళ్ళీ రోజుకు 75 లక్షల డోసులు పంపిణి జరుగుతుంది. వాక్సిన్ వేసుకున్న వారిపై కరోనా ప్రభావం పెద్దగా ఉండబోదనే వార్త కూడా ప్రజలలో వాక్సిన్ తీసుకోవాలనే ఆలోచనను పెంచుతుంది. దీనితో వాక్సిన్ వేసుకునే వారి సంఖ్య కూడా ఘననీయంగా పెరిగిపోతుంది. పిల్లలపై ప్రభావం ఉంటుంది అనేది మాత్రం ఇంకా లేకపోయినా, వాళ్లకు వాక్సిన్ అనేది ఎప్పుడు వచ్చేది ఇంకా డైలమాలోనే ఉన్న విషయం. పెద్దలైతే వాక్సిన్ తో సేఫ్, పిల్లలు స్వతహాగా ఉన్న ఇమ్మ్యూనిటి తో సేఫ్. ఎన్ని ఉన్నప్పటికీ ముందస్తు జాగర్తలు మాత్రం తప్పనిసరి, ఇది మర్చిపోకూడదు. ప్రపంచంలో కరోనా కనిపించకుండా పోయేవరకు ఈ జాగర్తలు మాత్రం తప్పవు.

మరింత సమాచారం తెలుసుకోండి: