కరోనా ప్రభావంతో ఆ వైరస్ ప్రభావాన్ని తట్టుకోవడానికి కొత్త టీకాలు వేసుకోవాల్సి వచ్చింది. దానిలో కూడా కొందరు ఒక డోసు అని మరికొందరు రెండు డోసులు అవసరం అని చెప్పడం మొదలు పెట్టారు. దీనితో ఆయా దేశాలలో సౌలబ్యాన్ని బట్టి ఒకటో రెండో డోసులకు సిద్ధం అయ్యారు ప్రజలు. అయితే అమెరికా మరో రకంగా ఆలోచిస్తూ, బూస్టర్ డోస్ అనే అంశాన్ని కూడా తెరపైకి తెచ్చింది. అప్పట్లో అది పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు కానీ, ఇప్పటి పరిస్థితికి మళ్ళీ దాని అవసరం గురించి చెపుతున్నారు. భారత్ లో కూడా అది అవసరం అని ఇప్పటికే ఆయా సంస్థలు సూచిస్తున్నాయి కూడా.

దీనితో ఇప్పటికే రెండు డోసులు కూడా సరిగా తీసుకోని వారు ఉన్నారు, మరోసారి బూస్టర్ డోస్ అంటే అదొక ఆర్థిక భారం, కానీ వ్యాధులు అంటేనే నేటి ప్రపంచంలో వ్యాపారం. కేవలం ఈ వ్యాపారం కోసమే, ఈ వైరస్ ను కూడా సృష్టించి ఉండవచ్చు అనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఇప్పటికి కోట్లలో వాక్సిన్ వ్యాపారం నడిచి ఉంటుంది. అయితే ఇదంతా వ్యాపారమేనా లేక నిజంగా అవసరం బట్టే అందరు తమ ప్రయత్నంతో ఆయా టీకాలను అభివృద్ధి చేస్తున్నారా అనేది కూడా ఆలోచించాల్సిన అంశం. అంతా మంచికే అనుకోవడం తప్ప మరొకటి లేదు, కనిపించడం లేదు కూడా, పరిస్థితులు అలాంటివి.

వ్యాపారం అయినా, నిజం అయినా, అదంటూ(బూస్టర్ డోస్) వాడుకోవాలి అంటే, ఖచ్చితంగా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానిని భారత్ స్వయంగా ఉత్పత్తి చేసుకుంటుందా లేక ఎక్కడ నుండైనా కొనాలా అనేది ముందు ముందు చూడాల్సి ఉంది. ప్రస్తుతం  అయితే 40 ఏళ్ళు పైబడిన వారికి ఈ బూస్టర్ డోస్ 6-9 నెలల తరువాత అవసరం అంటున్నారు నిపుణులు. అంటే రెండు డోసులు తీసుకున్న తరువాత ఆరు లేదా తొమ్మిది నెలల తరువాత శరీరంలోని రక్షణ వ్యవస్థ మళ్ళీ సన్నగిల్లే అవకాశం ఉందట, అందుకని బూస్టర్ డోస్ అవసరం అంటున్నారు. ప్రస్తుత వేరియంట్ కారణంగా అత్యవసరం కూడా కావచ్చు. దీనిపై కార్యాచరణ మరో నాలుగు వారాలలో చేయనున్నారు. అలాగే 44కోట్ల మంది పిల్లలకు కూడా వాక్సినేషన్ పై ఒక తుది నిర్ణయం ఈ గడువులోగానే తీసుకోనున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: