ఒకప్పుడు కీళ్ల వాతం అనేది చాలా అరుదుగా వచ్చేది. అది కూడా వయసు మీద పడిన వాళ్ళే ఈ వ్యాదికి గురయ్యేవారు. కానీ ఇప్పుడలా కాదు చాలా మంది కీళ్ల వాతం భారిన పడుతున్నారు. అది కూడా ముప్పై వయసు దాటిన వారు కూడా ఈ కీళ్ళవాతం భారిన పడుతుండడం గమనార్హం. కాగా కీళ్ల వాతం అంటే కీళ్ల వద్ద బాగా వాపులు రావడం , నడవలేకపోవడం తీవ్రమైన నొప్పులతో బాధ పడటం వంటివి ఎక్కువగా ఉంటాయి. నేటి ఆధునిక జీవితంలో వచ్చిన మార్పుల వలన కూడా కీళ్ల వాతం భారిన పడుతున్నారు. బరువు పెరగడం, శరీరానికి పెద్దగా వ్యాయామం లేకపోవడం, ఎక్కువ సేపు కూర్చోవడం వంటి వాటి వలన కూడా కీళ్ళవాతం వస్తోంది.

అయితే కీళ్ళవాతంతో బాధపడే వారు కొన్ని ఆహార పదార్థాలను అస్సలు తీసుకోరాదు. గడ్డ కూరలు తినరాదు. అంతేకాదు టమాటాలు కూడా మీ కీళ్లవాతాన్ని ఇంకా రెట్టింపు చేసి మరింత బాధలు పెంచుతాయని కొందరు వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా తెలుగు వారు టమోటా లేనిదే వంట జరగదు. అదే కాకుండా టమోటా ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది. కానీ కీళ్ళవాతం ఉన్నవారికి మాత్రం ఇది ప్రమాదాన్ని మరింత పెంచుతుందని చెబుతున్నారు. కాబట్టి కీళ్ళవాతం ఉన్నవారు గడ్డ కూరలకు చాలా దూరంగా ఉండాలి. అలాగే టమోటా వాడకం కూడా చాలా వరకు తగ్గించడం మంచిది.

కొన్ని ఆహార పదార్థాలు కీళ్ల నొప్పులను రెట్టింపు చేసి మరింత బాధిస్తాయి అలాంటి వాటిలో టమోటా కూడా ఒకటి. అందుకే టమోటకు దూరంగా ఉండటం ఉత్తమం. టమాటాల్లో అధికంగా ఉండే యూరిక్ యాసిడ్ కీల్లవాతాన్ని మరింత పెరిగేలా చేస్తుంది. ఇక వీటితో పాటుగా టీ, కాఫీలు మైదాతో తయారుచేసే పదార్థాలు, పాలిష్‌ చేసిన తెల్ల బియ్యం,  వేపుళ్ళు, స్వీట్లు, పంచదార, వంటి వాటిని కూడా కీళ్ల నొప్పులు ఉన్న వారు వీటిని తినకపోవడమే మంచిదని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: