బూస్టర్ డోస్ గురించి మరోసారి చర్చ లేవనెత్తింది కొత్త వేరియంట్. దీనితో భారత్ లో కూడా కోవిషిల్డ్ ను బూస్టర్ డోసుగా వాడేందుకు ఆరోగ్య శాఖ అనుమతి కూడా ఇచ్చింది. దీని అవసరం ఎంతవరకు ఉంటుంది అనేది అందరి ప్రశ్న. ప్రస్తుతం దేశంలో విస్తృతంగా సాగుతున్న వాక్సినేషన్ ప్రక్రియ లో 125 కోట్ల మార్కును దాటేసింది. అయినా అక్కడక్కడా ఆయా వయసువారు టీకాలు వేయించుకొని వాళ్ళు ఉండటం వలన వారి వద్దకే వెళ్లి ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తిచేస్తుంది. ఇలా దేశంలో వాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతుంది. ఇటీవల కాస్త కరోనా తగ్గడం తో అధికారులు టీకా కార్యక్రమాన్ని నెమ్మదిగా చేసినప్పటికీ, ప్రస్తుతం మళ్ళీ ఊపు అందుకుంది. రోజుకు కోటికిపైగా వాక్సినేషన్ లు కేంద్రం ఆయా రాష్ట్రాలకు సరఫరా చేస్తూనే ఉంది.

తాజా వేరియంట్ త్వరితంగా వ్యాప్తి చెందుతుంది అనే వార్తతో అన్ని దేశాలు వందశాతం వాక్సినేషన్ కోసం కృషి చేస్తున్నాయి. చాలా చోట్ల మరోసారి కరోనా విజృంభణ జరుగుతున్నప్పటికీ, టీకా కార్యక్రమాన్ని కూడా విస్తృతం చేస్తున్నారు. తద్వారా వ్యాప్తిని, ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నారు. ఇన్ని చేస్తున్నప్పటికీ, కరోనా ప్రభావం మరోసారి దాడిచేస్తే అప్పటికి ఆయా వయసు వారికి రోగనిరోధక శక్తి లోపిస్తే పరిస్థితి మళ్ళీ మొదటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఇప్పటి పరిస్థితిని బట్టి బూస్టర్ డోస్ మరోసారి తెరపైకి వచ్చింది. ఈసారి దీనిని వాడాల్సిందే అనే తీర్మానానికి వచ్చినట్టే ఉన్నాయి ఆయా దేశాలు.

బూస్టర్ డోస్ వాడటానికి కూడా మార్గదర్శకాలను రూపుదిద్దే ప్రక్రియలో ఆయా దేశాలు ఉన్నాయి. ఎవరికి తొందరగా రోగనిరోధక శక్తి లోపించే అవకాశాలు ఉన్నాయో ముందుగా వారికే ఈ డోసు ఇవ్వాల్సి వస్తుంది. అంటే టీకా వచ్చిన ప్రారంభంలో, ముందు పెద్దలకు ఇవ్వాలని, అనంతరం యువకులకు ఇవ్వాలని తీర్మానించినట్టుగా, బూస్టర్ డోసు పై కూడా ఒక ఖచ్చితమైన మార్గదర్శకాలు తీసుకురానున్నారు. ఆ ప్రకారం అందరికి ఇవ్వాలా లేదా కరోనా ప్రభావాన్ని బట్టి ఆ నిర్ణయం ఉంటుందా అనేది ముందు ముందు చూడాల్సిన విషయాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: