థర్డ్ వేవ్ వస్తుంది అనుకున్న సమయంలో అది పెద్దగా ప్రాభవం చూపకపోవడంతో భారత్ లో కరోనా దాదాపు పోయినట్టే అనుకున్నారు. కానీ కాస్త ఆలస్యంగా వస్తుందని ఎవరు ఊహించలేదు. కాకపోతే ఊరికే రాకుండా, కొత్త వేరియంట్ గా వచ్చింది. ఈ వేరియంట్ పై ఇప్పటికి కొన్ని అనుమానాలు ఉన్నాయి. దాని ప్రభావానికి టీకా వేసుకున్నా కూడా తట్టుకుంటారా అని. అయితే ఈ టీకాల ప్రభావం ఆరు నెలలు ఉంటుంది. ఈ ఆరు నెలలలో కరోనా రాకుండా చూసుకుంటే సరిపోదు. అనంతరం కూడా కరోనా మన దేశంలో ఉన్నా లేక ఇతర దేశాలలో ఉన్నా కూడా మనం జాగర్త వహించాల్సి వస్తుంది. ఆరు నెలలు గడిస్తే మళ్ళీ ఒకసారి టీకా వేసుకుంటేనే తప్ప కరోనా నుండి అది కూడా కొత్త వేరియంట్ నుండి తట్టుకోవడం కష్టం.

ఆరు నెలలు గడిచినప్పుడు వ్యక్తి శరీరంలో రోగనిరోధక శక్తి మళ్ళీ సాధారణ స్థితికి వస్తుంది కాబట్టి, అలాంటి దశలో కరోనా మన ప్రాంతాలలో లేదా దేశంలో ఉన్నట్టయితే మరో డోసు వాక్సిన్ తప్పదు. ఇప్పుడు దీని గురించే కేంద్ర ప్రభుత్వం కూడా సమాలోచనలు చేస్తుంది. తద్వారా టీకా ఉత్పత్తిని తగినంత చేర్చిపెట్టుకోవడము లేదా ఎవరెవరికి టీకాలు వేసి ఆరు నెలలు అయ్యింది అనేది మరోసారి లెక్కలు తీసి వారిని మూడో డోసు వేసుకోవాల్సిందని సూచించడము లాంటివి చేయాల్సి ఉంటుంది. అలా వాళ్ళ ప్రాణాలు కాపాడగలిగిన వారము అవుతాము. ఇది మొదటి కేసు, రెండో కేసులో ఇప్పటికే ఆయా రోగాలతో బాధపడుతూ ఉండి టీకాలు కూడా రెండు డోసులు తీసుకోని ఉండి ఆరు నెలలు గడిచిపోతే వాళ్లకు కూడా ఈ తరహా మూడో డోసు ఇవ్వాల్సి వస్తుంది.

ప్రత్యేకంగా అనారోగ్యాలతో బాధపడుతున్న వారి లో రోగనిరోధక శక్తి అనుక్షణం క్షిణించి పోతుంటుంది కాబట్టి వారికి రెండు డోసులు ఇప్పటికే ఇచ్చినప్పటికీ, సమయానుకూలంగా మూడో డోసు కూడా ఇవ్వాల్సి రావచ్చు. ఒకవేళ వారి రోగనిరోధక శక్తి తగ్గే సమయానికి కరోనా దేశంలో ఉంటె, అది వాళ్లకు ప్రమాదం కావచ్చు కాబట్టి, వాళ్లకు మరో డోసు టీకా అవసరం ఖచ్చితంగా ఉంటుంది. దీనిపై కూడా ప్రభుత్వం సరికొత్త కార్యాచరణ సిద్ధం చేయబోతుంది. ఒకసారి అది తయారైతే సదరు సమాచారాన్ని ఆయా వ్యక్తులకు లేదా రాష్ట్రాలకు తెలియజేయవచ్చు. తద్వారా వారికి తగిన సమయంలో సమాచారం అందుతుంది, వాళ్ళు కూడా మరో డోసుకు సంబంధించి సన్నద్ధులు కాగలరు. ముందు జాగర్తలు తీసుకుంటూనే ఈ అదనపు డోసు తీసుకోవాల్సి ఉంటుంది. ఏ డోసు అయినా కరోనా నుండి పూర్తిగా కాపాడలేదు, కేవలం దాని నుండి రక్షణ కోసమే అని గమనించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: