సహజంగా  మనకు శీతాకాలంలో అనేక చర్మ సమస్యలు ఎదురవుతాయి. చర్మం పొడిబారడం పగలడం వంటి  సమస్యలు అనేకం వస్తుంటాయి. ఈ కాలంలో మన చర్మాన్ని  వీలైనంతవరకూ తేమగా ఉంచుకుని ప్రయత్నం  చేయాలి. చలికాలంలో చర్మం పై ఎక్కువ దృష్టి పెట్టాల్సిన కాలం. ఎక్కువమందికి బయట ఉండే వాతావరణం ఆనందంగా కనిపించినా కానీ వాని చర్మంలో వచ్చే సమస్యలు తట్టుకోలేరు. కాబట్టి శీతాకాలంలో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా నష్టం జరుగుతుంది. మనకు అంతర్గత ఆరోగ్యం ఎంత అవసరమో, బాహ్యంగా కూడా రక్షించుకోవడం అంతే అవసరం. చలికాలంలో సహజంగా ఎదురయ్యే ప్రధాన సమస్య చర్మం పగలడం, పొడిబారడం. వీటి నుండి రక్షించుకోవాలంటే  ఏం చేయాలో తెలుసుకుందాం..?
 గుడ్డు, చికెన్, చేపలు..!
 ఈ సీజన్ లో ఎక్కువగా నట్స్, ధాన్యాలు, పప్పులు వంటివి మనం తినే రోజు  ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఎక్కువగా మాంసాహార ప్రియులైతే తొందరగా జీర్ణం అయ్యే గుడ్లు, చేపలు, చికెన్ తీసుకుంటే బాగుంటుంది. అలాగే బత్తాయి కమలా పండ్లు, బొప్పాయి పండ్లు తినాలి.

 కొబ్బరినీళ్లు..
 శీతాకాలంలో డైట్ పాటించడం మంచిది. కొబ్బరి నీళ్ళు మనం వేసవికాలంలో తాగితే మంచిదని అనుకుంటాం. కానీ కొబ్బరి నీరు శీతాకాలంలో తాగిన ఆరోగ్యమే. అలాగే రాత్రి భోజనానికి ముందు కూరగాయల చూపులు తీసుకోవాలి. దీనికితోడు ఉదయం పూట  పుదీనా, తులసి, గ్రీన్ టీ లను, అలాగే నిమ్మరసాన్ని ఎక్కువగా తీసుకుంటే చర్మం మృదువుగా తయారవుతుంది.
 ప్రతిరోజు సగటున ఒక మహిళ  2.8 లీటర్లు, పురుషులు3.8 లీటర్లు నీటిని తీసుకుంటే ఆరోగ్యానికి, ఇది చర్మానికి చాలా మంచిది. ఏకాలంలో నైనా సరే నీరు ఎక్కువగా తాగడం వలన శరీరంలోని వ్యర్థాలన్ని  బయటకు పోతాయి. దీంతో చర్మం పొడిబారకుండా ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధమైన డైట్ పాటిస్తే శీతాకాలంలో మీ చర్మం చాలా మృదువుగా మరియుుు కాంతి వంతంగా తయారవుతుందని చెప్పవచ్చు . 

మరింత సమాచారం తెలుసుకోండి: