ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్ని భ‌యాందోళ‌న‌కు గురిచేస్తున్న కొత్త వేరియంట్ `ఒమిక్రాన్‌` పై ర‌క‌ర‌కాల విశ్లేష‌ణ‌లు, వ్యాఖ్యానాలు వ‌స్తున్నాయి. మ‌ళ్లీ లాక్‌డౌన్ వ‌స్తుందా, కేసులు బీభ‌త్సంగా పెరుగుతాయా..? ఏ పరిస్థితులు ఉంటాయి.. ఇలాంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం వాస్త‌వంగా ఇప్ప‌టికి ప్ర‌పంచ ఆరోగ్యం సంస్థ ద‌గ్గ‌ర లేద‌నే చెప్పాలి. ఎందుకంటే.. ఒక్క వేరియంట్ వ‌చ్చిన త‌రువాత దాని ప్ర‌భావం ఎలా ఉంటుంది అని తెలుసుకోవ‌డానికి స‌మ‌యం ప‌డుతుంది. గ‌తంలో వ‌చ్చిన డెల్టా వేరియంట్ బీభ‌త్సం సృష్టించి సెకండ్ వేవ్ రావ‌డానికి దాదాపు 5 నెల‌ల స‌మ‌యం ప‌ట్టింది. 40 ప్ర‌పంచ దేశాల‌కు పాకిన ఈ వైర‌స్ సౌతాఫ్రికలో ఎక్కువ కేసులు న‌మోద‌వుతున్నాయి.


 అయితే, అన్ని చోట్ల వైర‌స్ ఒకేర‌కంగా ప్ర‌భావం చూప‌దు. ప‌రిస్థితులను బట్టి వైర‌స్ విజృంభ‌ణ ఉంటుంది. ఇప్ప‌టి వ‌ర‌కు సౌతాఫ్రికాలో ఉన్న వివ‌రాలు బ‌ట్టి ఒమిక్రాన్ పై అంచ‌నాలు వేస్తున్నారు. దీంతో సౌతాఫ్రికాలో ఉన్న‌ట్టు భార‌త్‌లో వేరియంట్ ప్ర‌భావం చూపుతుందా అంటే అది ఎవ‌రికి తెలియని విష‌యం అనే చెప్పాలి. సౌతాఫ్రికాలో ప‌రిస్థితులు చూస్తే ఒమిక్రాన్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఒమిక్రాన్ గుర్తించిన వారం రోజుల్లో పాజిటివిటీ 30 శాతం పెరిగింది. శాస్త్ర‌వేత్త‌ల అంచ‌నాల ప్ర‌కారం ఈ వేరియంట్ ఐదు రేట్లు వేగంగా వ్యాప్తి చెందుతుంద‌ని తెలుస్తోంద‌ని చెబుతున్నారు.


  అలాగే, మిగ‌త వేరియంట్లతో ఒమిక్రాన్‌ను పోల్చి చూస్తే అత్య‌ధికంగా మార్పులకు గుర‌యింది. అలాగే, ఇది ఎంత తీవ్ర‌మైన వ్యాధికి కార‌ణ‌మ‌వుతుంద‌నేది చూసుకుంటే.. సౌతాఫ్రికాలో ఇది కొద్ది పాటి ప్ర‌భావం చూపుతుంద‌ని తెలుస్తోంది. అయితే, ఇది ఇంకా పూర్తిగా నిరూపితం కాలేదు. అలాగే, ఆస్ప‌త్రుల్లో చేరేవారి సంఖ్య ఎక్కువ‌గా ఉంటోంది. ఒమిక్రాన్ రీఇన్‌ఫెక్ష‌న్ ప్ర‌భావం ఎంత ఉంటుంది, ఇదివ‌ర‌కు క‌రోనా సోకిన వారిపై ఎలాంటి ప్ర‌భావం చూపుతుంద‌నే చూస్తే డెల్టా వేరియంట్ కంటే మూడు రేట్లు ఎక్కువ‌గా ఉండ‌వ‌చ్చు అనేది అంచ‌నా వేస్తున్నారు. సౌతాఫ్రికాలో ఒమిక్రాన్ అనుభం చూస్తే గ‌తంలో కంటే ఇప్పుడు ఆస్ప‌త్రుల్లో చేరిన వారిలో పిల్లల సంఖ్య ఎక్కువ‌గా ఉంటోందని తెలుస్తోంది.


 




 

మరింత సమాచారం తెలుసుకోండి: