నేటి ఉరుకుల పరుగుల జీవితంతో టైంకు ఫుడ్ తినడం కొన్ని సార్లు కుదరకపోవచ్చు. ఆహరం సమయానికి తినకపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చిపడుతుంటాయి. ఆహరం సమయానికి తీసుకోకపోవడం వల్ల ముఖ్యంగా నిద్రకు తీవ్ర భంగం వాటిల్లే ప్రమాదం ఉంది. మన రోజు దినచర్యలో సుఖవంతమైన  నిద్ర మనకు చాల అవసరం. సరిగా నిద్ర పట్టకపోతే అందుకు  కొన్ని ఆహారాలు సహాయపడుతాయి. మీరు తినే ఈ ఆహారాలు నిద్రమీద ప్రభావం చూపుతాయి. మరి నిద్రకు సహకరించే ఆ సూపర్ ఫుడ్స్ గురించి తెలుసుకోండి.. అంతే కాకుండా మీ వారికి కూడా దీని గురించి చెప్పండి.


 రాత్రిళ్ళు గాఢంగా నిద్రపోవాలంటే పాలు తాగాలి. గోరువెచ్చని పాలు తాగడం వల్ల త్వరగా నిద్ర రావడమే కాకుండా గాఢంగా నిద్రపోతారు. పాలల్లో ఉండే  ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ విడుదలై నిద్ర మంచిగా పడుతుంది. దీంతో కళ్ళకు మంచి విశ్రాంతి దొరుకుతుంది. పాలలో ఉండే కాల్షియం ఒత్తిడిని తగ్గించి మెదడులోని నరాలను ఫ్రీ చేస్తుంది.  అయితే కొందరికి పాలు తాగడం ఇష్టం ఉండదు.. అలాంటి వారు అరటిపండు తినొచ్చు.. అరటిపండులో కూడా ట్రిప్టోఫాన్ తో పాటు విటమిన్ బి ఉంటుంది. అంతేకాకుండా అరటిపండులో ఉండే  మెగ్నీషియం, పొటాషియం లు కండరాలపై పడిన ఒత్తిడిని తగ్గిస్తాయి. 

అధిక ఒత్తిడికి గురైన కండరాలను కూడా అరటిపండుతో చెక్ పెట్టవచ్చు. ఇవేకాకుండా వాల్ నట్స్ కూడా మనకు మంచి నిద్రను అందించేందుకు ఉపయోగపడుతాయి. వాల్ నట్స్ లో మెలటోనిన్  అధికంగా ఉండడం వలన నిద్రపోవటంలో ఇవి సహాయకారిగా పనిచేస్తాయి. రాత్రి నిద్రించడానికి ముందు ఈ సూపర్ స్నాక్ తినడం వల్ల మంచిగా నిద్ర పడుతుంది. డ్రై ఫ్రూట్ లలో అందరూ ఇష్టపడే బాదం  కూడా గాఢ నిద్రకు పనిచేస్తుంది. బాదంలో ఎక్కువగా  ట్రిప్టోఫాన్, మెగ్నీషియం లెవెల్స్ ఉండటం వల్ల ఇవి కండరాలను రిలాక్స్ చేస్తాయి. ఇవే కాకుండా.. గుమ్మడి విత్తనాలు, కివి ఫ్రూట్ కూడా సుఖవంతమైన నిద్రకు తోడ్పడుతాయి. మీరు కూడా ఈ రోజు నుంచి ట్రై చేయండి. నచ్చితే మరొకరికి చెప్పండి.

మరింత సమాచారం తెలుసుకోండి: