అరటిపండు ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో ఉండే విటమిన్లు, పొటాషియం శరీరానికి చాలా అవసరం. కాబట్టి ప్రతిరోజూ అరటి పండ్లను తినడం మంచిది. అయితే అరటి పండుతో పాటు దాని తొక్క కూడా ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుందని తెలుసా? అరటి పండును అందరూ తింటారు. కానీ దానిపై తొక్కను మాత్రం విసిరివేస్తారు. కానీ అది మన శరీరానికి ఎలాంటి ప్రయోజనం చేకూరుస్తుందో చాలా మందికి తెలియదు. అరటిని పోషకాల నిల్వగా పరిగణిస్తారు డైట్ నిపుణులు. దానిపై తొక్కలో విటమిన్లు B6 మరియు B12 కూడా ఉంటాయి. ఇది కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి తదుపరిసారి అరటి తొక్కను విసిరే ముందు ఆలోచించండి. అరటి తొక్క శరీరానికి ఎలా మేలు చేస్తుందో తెలుసుకుందాం.

రోగనిరోధక శక్తి
రోగనిరోధక శక్తికి అత్యంత ముఖ్యమైన విటమిన్ ఎ న్నా విషయం తెలిసిందే. అది అరటి తొక్కలో పుష్కలంగా లభిస్తుందనేది మాత్రం చాలామందికి తెలియదు. దీనివల్ల వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఇన్ఫెక్షన్‌లతో పోరాడడంలో సహాయప డుతుంది.  

దంతాలను తెల్లగా చేస్తుంది
దంతాలను శుభ్రం చేయడానికి కూడా అరటి తొక్కను ఉపయోగించడం మంచిది. దంతాలు పసుపు రంగులోకి మారితే, మళ్ళీ తిరిగి తెల్లగా మారడానికి అరటి పండు తొక్కను ఉపయోగిస్తే సరిపోతుంది.

హైబీపీ
బీపీ సమస్యలు ఉన్నవారు కూడా అరటిపండు తొక్కలను తీసుకోవాలి. పొటాషియం ఉండటం వల్ల హైబీపీ అదుపులో ఉంటుంది.

జీర్ణ వ్యవస్థ
 పీచు అరటి పండులో మాత్రమే కాదు దాని తొక్కలో కూడా సరైన మోతాదులో లభిస్తుంది. కడుపులోని జీర్ణవ్యవస్థకు ఫైబర్ ఎంత ముఖ్యమో అందరికి తెలిసిందే. అందుకే అరటి పండు తొక్కను ఆహారంలో భాగం చేసుకోండి.

ఎముకలకు అవసరం
ఎముకలకు అవసరమైన కాల్షియం అరటి పండు, దాని తొక్కలో పుష్కలంగా ఉంటుంది. వింటర్ సీజన్ కాబట్టి ఇప్పుడు ఎముకలకు సంబంధించిన సమస్యలు తరచుగా ఇబ్బంది పెడతాయి.  

చర్మానికి మేలు చేస్తుంది
మీరు చర్మంపై మొటిమల సమస్యను ఎదుర్కొంటే, ఈ సమస్యను వదిలించుకోవడానికి అరటి తొక్కను తీసుకుని ముఖంపై రుద్దండి. మీ చర్మ సంరక్షణ దినచర్యలో అరటి తొక్కను చేర్చండి.

మరింత సమాచారం తెలుసుకోండి: