దక్షిణాఫ్రికాలో పుట్టిన కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ప్రపంచ దేశాలను చుట్టుముడుతోంది. ఓమిక్రాన్ దెబ్బకు యూరప్ లోని పలు దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. అగ్ర దేశం అమెరికా పైన కూడా ఓమిక్రాన్  మహమ్మారి పంజా విసురుతోంది.యూఎస్ లో ఓమిక్రాన్ కేసులు ఊహించని విధంగా పెరుగుతున్నాయి. కేవలం ఒక వారం వ్యవధిలోనే కేసులు సంఖ్య మూడు శాతం నుంచి  73 శాతానికి పెరిగింది. ఆ దేశంలో ఓమిక్రాన్ శర వేగంగా వ్యాప్తి చెందుతోంది. గత వారం డెల్టా వేరియంట్ కేసులు అధికంగా ఉన్నాయని, కానీ ఈ వారంలో  ఓమిక్రాన్ కేసులు విపరీతంగా పెరిగిపోయాయని సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ రివెన్షన్ తెలిపింది.ఈవారం డెల్టా వేరియంట్ కేసులు దాదాపు 27 శాతం మాత్రమే ఉండగా భారీగా పెరుగుతున్న ఓమిక్రాన్ కేసులు అమెరికాలో భయాందోళనలు పెంచుతున్నాయి.

 కేసులు ఇదే రీతిలో పెరుగుతూ పోతే దేశంలోని హెల్త్ కేర్ సిస్టం తీవ్రంగా దెబ్బతింటుందని వారు భావిస్తున్నారు. యూఎస్ లోని కొన్ని రాష్ట్రాల్లో ఓమిక్రాన్ కేసులు అత్యంత ఎక్కువగా నమోదయ్యాయి. న్యూయార్క్, న్యూజెర్సీ లలో 92 శాతం, వాషింగ్టన్ లో 96 శాతం కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని, వ్యాక్సిన్ ఇప్పటికే వేయించుకున్న వారు బూస్టర్ డోస్  వేయించుకోవాలని మోడర్నా నా సంస్థ సూచించింది. తమ వ్యాక్సిన్ మూడో డోస్ వేసుకుంటే శరీరంలో యాంటీబాడీలు పెరుగుతాయని తెలిపింది. తమ వ్యాక్సిన్ ల థర్డ్ డోస్ ఓమిక్రాన్ ప్రభావాన్ని నియంత్రిస్తుందని బయోటెక్ సంస్థలు తెలుపుతున్నాయి. అదుపు తప్పితే లాక్డౌన్ రాష్ట్రాలకు కేంద్రం సూచన. కొత్త వేరియంట్ ఓమిక్రాన్, డెల్టా వేరియంట్ కంటే స్పీడ్ గా వ్యాప్తి చెందుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

ఈ నేపథ్యంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని,జాగ్రత్త వహించాలని హెచ్చరించింది. ప్రతి ఒక్కరూ మాకు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని కోరింది. పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని తెలిపింది. అవసరమైతే రాత్రి కర్ఫ్యూ లొక్డౌన్ విధించుకోవాలని కేంద్రం సూచించింది. ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా కరోనా మహమ్మారిని 2022 లో అంతం చేయాలని డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రోస్ అన్నారు. ఈ పరిస్థితి మారాలని ప్రపంచమంతా సమాంతరంగా వ్యాక్సినేషన్ జరిగితే మంచిదని టెడ్రోస్ అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: