సీజన్ తో సంబంధం లేకుండా ఎప్పుడైనా సరే మనకు విరివిగా దొరికే పండు ఏదైనా ఉంది..అంటే అది కేవలం జామకాయ మాత్రమే అని చెబుతారు. ఇక జామకాయలో ఎన్నోరకాల ఔషధ గుణాలు ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే జామకాయను డయాబెటిస్ వారు సైతం తినడానికి ఇష్టపడతారు . ఈ జామకాయ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. కాబట్టి చక్కగా వీటిని తినవచ్చు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ఏమిటంటే జామకాయ తినడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది అని చెబుతున్నారు. కొంతమంది ఇది ఎంతవరకు నిజమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అసలు విషయమేమిటంటే.. విత్తనాలు ఉండే పండ్లను తినడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడతాయని ఎంతోమంది అనుకుంటున్నారు. ఇక ఈక్రమంలోనే టొమాటో, జామ కాయ, బెండకాయ వంటి విత్తనాలు కలిగిన పండ్లను, కాయగూరలను తినడం వల్ల కిడ్నీలో రాళ్లు పడతాయని అంతేకాదు కిడ్నీ లో సమస్యలు ఉండేవారు అసలు తినకూడదని చెబుతుంటారు అయితే ఇప్పుడు వీరందరికీ ఒక శుభవార్త అని చెప్పవచ్చును ఎందుకంటే విత్తనాలు కలిగిన పండ్లను లేదా కాయలను ఎవరైనా సరే నిర్మొహమాటంగా పుష్కలంగా తినవచ్చు. అదంతా కేవలం ఒక అపోహ మాత్రమే అని వైద్యులు కొట్టిపారేస్తున్నారు.

ఇక అసలు విషయానికి వస్థే.. విత్తనాలు వున్న పండ్లను తినడం వల్ల రాళ్లు ఏర్పడే సామర్థ్యాన్ని పెంచవు. అంతేకాదు ముఖ్యంగా వీటిని తినడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు.. కిడ్నీలో రాళ్లు వివిధ రకాలుగా ఉదాహరణకు యూరేట్ రాళ్లు, కాల్షియం రాళ్లు,  ఆక్సలేట్ రాళ్లు మొదలైనవి. పండ్లు ఆరోగ్యకరమైనవి, మూత్రపిండాల సమస్యలు లేని రోగులు అన్ని పండ్లను తినవచ్చు.  కానీ మూత్రపిండాల వ్యాధి ఉన్నవారు మాత్రం తమ ఆహారంలో యాపిల్, బొప్పాయి, బేరి,జామ, స్ట్రాబెర్రీలు,  పైనాపిల్ వంటి తక్కువ పొటాషియం వుండే పండ్లను చేర్చుకోవాలి.

జామపండులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ వుంటుంది కాబట్టి  ఇది జీర్ణమై క్రమంగా గ్రహించబడుతుంది. గ్లూకోజ్ స్థాయి క్రమంగా పెరగడానికి కూడా  దోహదం చేస్తుంది. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని కూడా అదుపులో ఉంచడంలో గొప్పగా పనిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: