ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంత అవసరమో అందరికీ తెలిసిన విష యమే అందిస్తాయి. ముఖ్యంగా కొత్తిమీర గురించి చెప్పుకుంటే కొత్తి మీరను అన్ని వంటకాల్లో ఉపయోగిస్తారు. కొత్తి మీర వాసన అద్భుతంగా ఉండటమే కాకుండా, కోత్తిమీర వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కానీ చాలామంది కొత్తిమీర ఆకులను మాత్రమే వాడుకొని కాడలు పనికిరావని వాటిని పడేస్తుం టారు.అందులో ఎన్నో పోషక విలువలు దాగి ఉంటాయి. కొత్తిమీరలో విటమిన్స్, మినరల్స్  పుష్కలంగా ఉంటాయి. కొత్తి మీరలో పోషకాలు, ఔషధ విలు వలు అనేకం.

 కొత్తిమీర మన శరీరంలో రక్తం లోని షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. ప్రతి రోజూ ఉదయమే పచ్చి కొత్తిమీర కొద్దిగా తినడం వల్ల షుగర్ వ్యాధి సమస్య నుండి విముక్తి పొంద వచ్చు. కొత్తిమీరలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిలో క్యాల్షియం పుష్కలంగా ఉండ టం వల్ల ఎముకల, కండరాల నొప్పి నుండి విముక్తి పొందవచ్చును. దీనివల్ల కంటిచూపు సమస్యలు కూడా దూరమవుతాయి.దీనిలో ఫైబర్,యాంటీ యాక్సిడెంట్ లు అధికంగా ఉంటాయి.ఇవి జీర్ణక్రియ మెరుగు పరుస్తాయి. జీర్ణశక్తిని పెంచుతాయి. మెటబాలిజం  పెరుగుతుంది. కొత్తిమీర ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా తోడ్పడుతుంది. కొత్తిమీరలో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మొటిమల సమస్య కూడా తగ్గిస్తుంది.

కనుక కొత్తిమీర కాడల్లో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి వీటిని పడేస్తే మీరు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోతారు. కొత్తిమీర కాడల్లో సిట్రో నెలోల్  ఉంటుంది. శరీరం లో సూక్ష్మజీవుల పెరుగుదలతో పోరాడటానికి, అల్సర్లకు చికిత్స చేసే గొప్ప క్రిమినాశకంగా ఉపయోగపడుతుంది. చర్మ సంరక్షణలో కొత్తిమీర కాడలు కీలక పాత్ర పోషిస్తాయి. ఎం డలో ఎక్కువగా తిరిగే వారి శరీరాన్ని ఇన్ఫెక్షన్ల బారినుంచి కాపాడు తాయి. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను క్రమబద్దీకరించడంలో దోహదపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: