ప్రస్తుతం కరోనా ఒమిక్రాన్ పేరిట థర్డ్ వేవ్ గా తన పంజా విసిరింది. ఇకపోతే ఈ కరోనా వైరస్ మన జీవితాల్లోకి వచ్చి పరిస్థితులను ఎంత దారుణంగా మార్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఇప్పుడు తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ అంత ప్రమాదకరమైన వ్యాధి కాకపోయినప్పటికీ చికిత్స కంటే నివారణ ఉత్తమం అనేది ప్రజలు తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ కరోనా సమయంలో మనం మన రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి అంటే తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.. ఈ ఒమిక్రాన్ వేళ ఇన్స్టెంట్ ఇమ్యూనిటీ బూస్టర్ ను పొందడానికి వంటగది ఒక ఉత్తమ ఫార్మసీ. వంటింట్లో దొరికే అతి తక్కువ పదార్థాలతో ఈ బూస్టర్ ను తయారు చేసుకొని మనలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు.
అయితే ఇందుకోసం మీరు చేయవలసిందల్లా మీ వంటగది లో దొరికే మీడియం సైజు కలిగిన మూడు నుంచి నాలుగు పచ్చి పసుపు కొమ్ములు, రెండు మీడియం సైజు క్యారెట్లు, రెండు అంగుళాల చిన్న అల్లం ముక్క. ఇక ఈ మూడింటిని జ్యూస్ రూపంలో చేసి ప్రతిరోజు 20 నుంచి 30 ఎమ్ఎల్ మొత్తంలో తీసుకోవడం వల్ల తక్షణ శక్తి రావడమే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తాయి.
పసుపులో ఉండే కర్క్యుమిన్ అనే పదార్థం రోగ నిరోధక శక్తిని పెంపొందించడం తో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా కలిగి ఉండడం వల్ల.. శరీరం లోపల ఉండే పేగులలో ఆరోగ్యకరమైన బాక్టీరియాను పెంపొందించడానికి సహాయపడుతుంది. ఎప్పుడైతే రోగ నిరోధక శక్తి పెరుగుతుందో.. క్రమంగా మనలో కొత్తగా వచ్చే వైరస్ ఏదైనా సరే ఎక్కువకాలం నిలవలేదు.క్యారెట్లో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి మొదటి పాత్ర వహిస్తుంది. ఎప్పుడైతే విటమిన్-సి శరీరానికి సమర్థవంతంగా అందుతుందో అప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి ఈ విటమిన్ సి సహాయపడుతుంది.
అల్లం లో కూడా రోగనిరోధకశక్తిని పెంపొందించే లక్షణాలు ఉండటం వల్ల జలుబు , దగ్గు వంటి లక్షణాల నుంచి విముక్తి కలిగిస్తుంది.. కాబట్టి ఈ మూడింటిని కలిపి తీసుకోవడం వల్ల మనకు తక్షణమే ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: