ఈ రోజుల్లో చాలా మందికి ఎక్కువగా వుండే సమస్యల్లో కొలెస్ట్రాల్ ఒకటి. కొలెస్ట్రాల్ తగ్గడానికి చాలా మంది చాలా రకాలుగా ట్రై చేస్తారు. కాని ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇక ఈ సమస్యని మనకిష్టమైన రుచికరమైన పండ్లని కూడా తిని తగ్గించుకోవచ్చు. మరి ఆ పండ్లు ఏంటో తెలుసుకుందామా..

1.స్ట్రాబెర్రీలు: స్టా బెర్రీలు చాలా రుచికరమైన పండ్లు.ఇక ఈ పండ్లని సౌందర్య సాధనాలలో కూడా వాడుతారు. తియ్యగా వుండే ఈ స్ట్రాబెర్రీలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఎంతగానో సహాయపడతాయి. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున చర్మానికి గ్లో వస్తుంది.

2.యాపిల్స్: యాపిల్స్‌లో పోషకాలు చాలా ఉంటాయి. ప్రతిరోజు కూడా ఒక యాపిల్ తింటే డాక్టర్ వద్దకు వెళ్లనవసరం లేదని అంటారు. ఇది ముమ్మాటికి కూడా నిజమే. ఎందుకంటే ఇందులో పెక్టిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలోని కొలెస్ట్రాల్‌ని ఈజీగా తగ్గించడంలో సహాయపడుతుంది. ఇక ఇందులో ఫైబర్ కూడా తగిన మోతాదులో ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది.

3.సిట్రస్ పండ్లు: నారింజ, నిమ్మ ఇంకా ద్రాక్ష మొదలైనవి సిట్రస్ జాతికి చెందిన పండ్లు. ఇందులో సి విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది.ఈ పండ్లు ఎక్కువగా చలికాలంలో లభిస్తాయి. ఈ పండ్లు కొలెస్ట్రాల్ తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తాయి.ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉన్నందున రోగనిరోధక శక్తిని కూడా బాగా పెంచుతాయి.

4.ద్రాక్ష: ఇక చలికాలంలో చిరుతిండి కోసం చూస్తున్నారా? దానికి ద్రాక్ష చాలా బెస్ట్‌. ఈ చిన్న ఆకుపచ్చ మెత్తని పండ్లు రుచికరమైన ఇంకా ఆరోగ్యకరమైన ఆహారంగా చెప్పవచ్చు. ఇవి బరువు తగ్గించడానికి ఎంతగానో సహాయం చేస్తాయి.అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ద్రాక్ష ఎలా సహాయపడుతుందో పలు అధ్యయనాలు కూడా నిరూపించాయి.

5.అవోకాడో: కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్న వారు తరచుగా అవోకాడో తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయనే అపోహతో వాటికి దూరంగా ఉంటారు. కానీ USDA ప్రకారం తెలిసిన సత్యం ఏమిటంటే.. అవోకాడోలో 0 mg కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇక అందువల్ల ఎలాంటి అనుమానం లేకుండా దీనిని తినవచ్చు. అదనంగా ఇది ఆరోగ్యకరమైన కొవ్వులను కూడా ఉత్పత్తి చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: