మనం ప్రతిరోజు చూసే.. తాగే ఎన్నో రకాల జావలలో రాగి జావ అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. ముఖ్యంగా రాగి జావ తాగడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది అని అందుకే వేసవి కాలంలో ఈ రాగి జావ ఎక్కువగా తాగడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అయితే ఈ రాగి జావ వేసవి కాలంలో మాత్రమే కాదు ఏ కాలంలో అయినా సరే తాగితే మంచి ఫలితం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. పోతే ఈ రాగి జావ తాగడం వల్ల మన శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మనం ఒకసారి చదివి తెలుసుకుందాం..


రాగి జావ లో ఫైబర్ సమృద్ధిగా లభించడం వల్ల జీర్ణక్రియ సమస్యలతో పాటు మలబద్దకం సమస్యలు కూడా దూరమవుతాయి.. ఇందులో అమైనో ఆమ్లాలు, పాలీఫినాల్స్, ఫైబర్ అధికంగా లభించడం వల్ల డయాబెటిస్ వంటి సమస్యలు కూడా అదుపులో ఉంటాయి. రాగులలో గ్లైసమిక్ ఇండెక్స్  తక్కువగా ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అదుపులో ఉంటాయి. అధిక బరువును తగ్గించుకోవాలని అందుకు తగ్గట్టుగా డైట్ కూడా ఫాలో అవుతున్న వారు తమ డైట్ లో రాగులను  చేర్చుకోవడం ఉత్తమ ఎంపిక.


రోగనిరోధక శక్తి పెరిగితే శరీరంలోకి ఎటువంటి వైరస్ వచ్చినా సరే ఇట్టే పోరాడగలిగే శక్తి శరీరానికి లభిస్తుంది. ముఖ్యంగా రాగి జావా లేదా రాగులతో తయారు చేసిన ఏ పదార్థం అయినా తినడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది..అందుకే గుండె సమస్యలు రాకుండా గుండె పదికాలాల పాటు పదిలంగా ఉండడానికి సహకరిస్తాయి. రాగి జావ ఎలా తయారు చేసుకోవాలి అనే విషయానికి వస్తే.. ఒక చిన్న గ్లాసు రాగి పిండి కి.. పెద్ద గ్లాస్ నీటిని తీసుకొని ఒక గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి.. గిన్నెలో నీళ్లు మరుగుతున్నప్పుడు చిన్న క్లాస్ రాగి పిండి ని మరొక చిన్న గ్లాసు నీటిని పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలిపిన రాగి పిండిని మరుగుతున్న నీటిలో నెమ్మదిగా పోస్తూ కలియబెట్టాలి. కొద్దిగా ఉప్పు వేసి.. స్టవ్ మీద నుంచి దింపేయాలి. ఇక మజ్జిగ కలుపుకొని ఉదయం సాయంత్రం రెండు పూటలా తాగడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. తల నొప్పి , కాళ్ళనొప్పులు , నీరసం , అలసట వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: