ఏదైనా కాని మితంగా తీసుకుంటే మనం ఎప్పుడు కూడా ఆరోగ్యకరంగా ఉంటాం. ఈ సూత్రం ఏ విషయంలో వర్తించిన వర్తించకున్న ఆల్కహాల్ విషయంలో మాత్రం తప్పకుండా వర్తిస్తుంది. ‘మద్యపానం ఆరోగ్యానికి హానికరం’ ఇది మనందరికీ తెలిసిన ఓ జీవిత సత్యం.ఆల్కహాల్ తాగడం వల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు అనేవి తలెత్తుతాయి. అయితే మద్యం తాగడం వల్ల పలు ప్రయోజనాలు కూడా ఉన్నాయి.ఇక మన శరీరంలో ఆల్కహాల్ అనేక రకాల ప్రభావాలను చూపిస్తుంది. అలాగే మెదడులో డోపమైన్‌ అనే మోలిక్యుల్‌ను ఆల్కహాల్ రిలీజ్ చేస్తుంది. స్త్రీల కంటే పురుషులు ఎక్కువగా మద్యం తాగుతారు.ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. చాలా తక్కువ వ్యవధిలోనే మహిళలపై ఈ ఆల్కహాల్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.రెడ్ వైన్ ఇంకా విస్కీ లాంటి డార్క్ లిక్కర్స్ వల్ల ఎక్కువగా హ్యాంగోవర్ సమస్యలు అనేవి వస్తాయి.

ఇక ‘సరైన పద్ధతిలో సేవిస్తే మద్యం హానికరం కాదు’.ఇలాంటి ప్రకటనలు మాత్రం అస్సలు నమ్మొద్దు.ప్రపంచంలోనే అత్యంత స్ట్రాంగెస్ట్ బీర్‌లో 67.5 శాతం ఆల్కహాల్ అనేది ఉంటుంది.ఒక సీసా వైన్ తయారీలో కనీసం 600 ద్రాక్ష పండ్లని వాడతారు.ఇక మీరు ఎప్పుడైనా కాని వోడ్కాను ఫ్రీజ్ చేయడానికి ప్రయత్నించారా? ఇక వోడ్కాను కనుక ఫ్రీజ్ చేయాలంటే మైనస్ 16.51 F డిగ్రీ ఉష్ణోగ్రత అనేది చాలా అవసరం.విస్కీ వాసన ద్వారా మనం మంచి నిద్రని పొందవచ్చు.అలాగే ఆల్కహాల్‌ను అనేక రూపాల్లో ఔషధాల తయారీలో కూడా ఉపయోగిస్తారు.ఇక ఈ ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం వల్ల క్యాన్సర్ ముప్పు అనేది 30 శాతం వరకు కూడా తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇక ఖాళీ కడుపుతో కనుక మద్యం సేవిస్తే.. 3 రెట్లు మత్తెక్కుతుందట. అదే ఫుడ్‌తో పాటు మద్యం తాగడం వల్ల చాలా ఆలస్యంగా మత్తులోకి వెళ్తారు.ఏది ఏమైనా కాని మద్యం వల్ల కేవలం 20% మాత్రమే ప్రయోజనాలు వున్నాయి. అవి కూడా చిన్న చిన్న ప్రయోజనాలే. కాని మద్యం వ్యసనంగా మారితే మాత్రం ఆరోగ్యానికి 80% శాతం ప్రమాదం వుంది. కాబట్టి మద్యానికి అస్సలు బానిస కాకండి. ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి.

మరింత సమాచారం తెలుసుకోండి: