ఉల్లి చేసే మేలు త‌ల్లి కూడా చేయ‌ద‌నే  ఒక సామెత ఉన్న‌ది. ఉల్లి ఏమి మేలు చేస్తుందో ప్ర‌తి ఒక్క‌రూ తెలుసుకోవాల‌ని ప‌లువురు నిప‌ణులు సూచిస్తున్నారు. ఉల్లిపాయ ర‌సం ఆరోగ్యానికి సంజీవ‌నిలా ప‌ని చేస్తుంది అని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఉల్లి వ‌ల్ల ప‌లు ప్ర‌యోజ‌నాలున్నాయి. జ‌ట్టు రాలే స‌మ‌స్య ఉన్న వారు ఈ జ్యూస్‌ని అప్లై చేసిన‌ట్ట‌యితే ఈ స‌మ‌స్య నుంచి సులువుగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చని చెబుతున్నారు.

ఉల్లిపాయ ర‌సంలో యాంటి అల‌ర్జిటిక్ యాంటీ ఆక్సిడెంట్‌, య‌యాంటి కార్సినోజెనిక్ ల‌క్ష‌ణాలున్నాయి. ఉల్లిపాయ ర‌సం తీసుకోవ‌డం వ‌ల్ల ప్ర‌ధాన వ్యాధుల నుంచి విముక్తి పొందొచ్చు. ఈ జ్యూస్‌ను రెగ్యుల‌ర్‌గా తాగ‌డం ద్వారా బ్ల‌డ్ షుగ‌ర్ బ్యాలెన్స్ చేయ‌డ‌మే కాకుండా కిడ్నీ స్టోన్స్ నొప్పి నుంచి కూడా ఉప‌శ‌మ‌నం ల‌భిస్తోంద‌ని పేర్కొన్నారు నిపుణులు.

 ఉల్లి ప్ర‌యోజ‌నాలు

జీవ‌న‌శైలిలో మార్పుల మూలంగా చాలా మంది కిడ్నీల్లో రాళ్లు ఏర్ప‌డుతుంటాయి. దీని ద్వారా కిడ్నీలు, న‌డుము, ఉద‌ర భాగంలో తీవ్ర నొప్పితో స‌త‌మ‌త‌మ‌వుతూ ఇబ్బందులు ప‌డుతుంటారు. కిడ్నీల‌లో రాళ్లుండి నొప్పితో బాధ‌ప‌డుతుంటే దాని నుంచి ఉప‌శ‌మ‌నం పొందేందుకు ఉల్లిపాయ వినియోగం ప్ర‌భావంతంగా ఉంటుంది. వారు త‌ప్ప‌కుండా ఉల్లిపాయ ర‌సం తీసుకోవ‌డం ఉత్త‌మైన మార్గం. ఉద‌యాన్నే ఖాళీ క‌డుపుతో ఉల్లిర‌సం తాగితే రాళ్ల నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.

ముఖ్యంగా బ్ల‌డ్ షుగ‌ర్‌ను బ్యాలెన్స్ చేస్తోంది. ఒక నియమం ప్రకారం ఉల్లిపాయ రసాన్ని తీసుకుంటే మీరు సులభంగా బ్ల‌డ్ షుగ‌ర్‌ను త‌ప్ప‌కుండా తగ్గించుకోవచ్చు. అదేవిధంగా బ్యాలెన్స్‌గా కూడా ఉంచుకోవచ్చు.

రోగనిరోధక శక్తి బలోపేతం కోసం ప్రజలు తరచుగా పచ్చి ఉల్లిపాయలను తినడానికి ఇష్టపడతారు. ఇది ఆరోగ్యాని ఎంతో మంచిది. పచ్చి ఉల్లిపాయను తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.  ఉల్లిలో  ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని బలోపేత‌ము చేస్తాయి.

చలి నుంచి ఉపశమనం, శీతాకాలంలో జలుబు సమస్య తరచుగా వేధిస్తుంటుంది. అలాంటి పరిస్థితిలో ఉల్లిపాయను ఉపయోగించడం ప్రయోజనకరం. మీరు జలుబు, ఫ్లూతో బాధపడుతున్నట్లయితే మీరు పచ్చి ఉల్లిపాయ లేదా దాని రసాన్ని తప్పనిసరిగా తీసుకుంటే ఉత్త‌మం.

ముఖ్యంగా కీళ్ల నొప్పులు, లేదా ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య ఉన్న‌వారు ఉల్లిపాయ తింటే ఎంతో మేలు పొంద‌వ‌చ్చు. ఆర్థ‌రైటిస్ స‌మ‌స్యతో బాధ‌ప‌డేవారు ఉల్లిపాయ ర‌సంతో పాటు ఆవాల నూనెతో మ‌ర్ధ‌న చేయాలి. ఇలా చేయ‌డం ద్వారా కీళ్ల నొప్పులు తొల‌గిపోతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: