తరచూ వచ్చే సీజనల్ వ్యాధుల లో జ్వరం కూడా ఒకటి. జ్వరం వచ్చినప్పుడు మనకు జీర్ణ వ్యవస్థ సరిగా పని చేయదు.. కాబట్టి మాంసాహారం తినకూడదు అని చెబుతూ ఉంటారు. ఎప్పుడైతే జీర్ణ వ్యవస్థ పని చేయడం తగ్గిస్తుందో క్రమంగా మాంసాహారాన్ని డైజెస్ట్ చేసే శక్తి కూడా తగ్గుతుంది..ఫలితంగా జ్వరం వచ్చినప్పుడు కడుపు ఉబ్బరం , గ్యాస్, కడుపులో మంట , అజీర్తి వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జ్వరం వచ్చినప్పుడు మాంసాహారం తినకూడదు అని చెబుతారు .ఇక మరొక విషయం ఏమిటంటే ముఖ్యంగా జ్వరం వచ్చినప్పుడు చికెన్ తింటే పచ్చకామెర్లు అవుతాయని అపోహ చాలా మందిలో ఉంటుంది.. ఇదంతా కేవలం అపోహ మాత్రమే కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ చికెన్ కూడా జ్వరం వచ్చినప్పుడు తినవచ్చు.


జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినాలా.. వద్దా.. అనే విషయానికి వస్తే చికెన్ తినాలి అనుకునేవారు బాగా మసాలాలు దట్టించి, ఎక్కువ నూనె వేసి వేయించుకొని తినడం వల్ల తప్పకుండా అనారోగ్యం బలపడుతుంది. కాబట్టి  నూనె తక్కువ వేసుకొని కేవలం ఉప్పు, కారం వంటి మసాలా తో మాత్రమే చికెన్ వండుకొని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిది.. ముఖ్యంగా ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా లభిస్తాయి కాబట్టి జ్వరం వచ్చినప్పుడు చికెన్ సూప్ చేసుకొని తాగడం వల్ల మరింత ప్రయోజనం కలుగుతుంది. జ్వరం వచ్చినప్పుడు చికెన్ నుంచి లభించే ఫైబర్, ప్రోటీన్ వల్ల మనకు శక్తి కూడా వస్తుంది.


చికెన్ సూప్ చేసుకొని తాగడం వల్ల శరీరానికి తక్షణమే శక్తి రావడంతో పాటు నీరసించిపోయిన శరీరానికి మంచి ఉపశమనం దొరుకుతుంది. చికెన్ సూప్ లో ద్రవాలు, ఎలక్ట్రోలైట్ లు ఉంటాయి కాబట్టి నీరసం కాస్త తొలగిపోయి జ్వరం వచ్చిన వ్యక్తి యాక్టివ్ గా ఉండడానికి దోహదపడుతుంది. పైన చెప్పిన విధంగా చికెన్ సూప్ చేసుకొని తాగడం వల్ల జ్వరం వచ్చినప్పుడు మరింత శక్తి చేకూరుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: