కొవిడ్ ట్రీట్మెట్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసింది. తేలికపాటి మరియు మధ్య, తీవ్ర లక్షణాలతో బాధపడేవారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అందులో క్లుప్తంగా వివరించింది.ట్రీట్మెంట్ లో భాగంగా కొవిడ్-19 రోగులకు స్టెరాయిడ్స్ ఇవ్వడం ఆపేయాలని డాక్టర్లకు నీతి అయోగ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ డాక్టర్ అయిన వీకే పౌల్ సూచించారట

స్టెరాయిడ్స్ వల్ల చాలా నష్టాలు ఉన్నాయని ఎక్కువ కాలం వాడితే బ్లాక్ ఫంగస్ లాంటి ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదముందని ఆయన హెచ్చరించారు. రెండు లేదా మూడు వారాల కంటే ఎక్కువగా దగ్గు ఆగకుండా కనుక వస్తే టీబీ పరీక్ష తప్పక చేయించుకోవాలని ఆయన చెప్పారు.

అలా కాకుండా శ్వాస తీసుకోవడంలో కనుక ఏదైనా తేలికపాటి సమస్యలు వాటిని స్వల్ప లక్షణాలుగా పరిగణించాలి. ముందస్తు జాగ్రత్తగా హోం ఐసోలేషన్ లో ఉండి ఐదు రోజులైన తగ్గకపోతే.. వైద్యుల్ని సంప్రదించాలి అని చెప్పారు.పరిస్థితిని బట్టి.. ఆక్సిజన్ లెవల్ 90-93 మధ్య ఉన్న కేసులను మోడరేట్ గా భావిస్తారట అలాంటి వారికి ఆక్సిజన్ సపోర్ట్ అవసరం అవుతుందని చెప్పుకొచ్చారు.


ఓ మాదిరి నుంచి తీవ్రంగా కరోనా లక్షణాలు ఉన్న వారికి రెమెడెసివిర్ డ్రగ్ మనం ఇవ్వొచ్చు. మూత్ర సంబంధిత వ్యాధులు ఉన్నవారికి అలాగే ఆక్సిజన్ సపోర్ట్‌ అవసరం లేని వారికి ఈ ఔషధాన్ని ఇవ్వకూడదు. తీవ్ర వ్యాధి లక్షణాలు ఉన్నవారికి మాత్రం 48 గంటలలోపు టోసిలిజుమాబ్ డ్రగ్‌ను ఇవ్వవచ్చు.

ఆక్సిజన్ లెవల్ 90 కన్నా తక్కువగా ఉంటే దానిని సీరియస్ గా పరిగణించి.. వెంటనే ఐసీయూ సదుపాయం ఉండే గదికి మార్చాలని కొత్త గైడ్‌లైన్స్‌లో పేర్కొన్నారట.ఈ జాగ్రత్తలు కనుక పాటిస్తే కరోనా కు కొంచెం దగ్గర కాకుండా ఉండవచ్చు. నిరంతరం చేతులను శుభ్రం చేసుకోవాలి. హ్యాండ్ శానిటైజర్ లు ఎక్కువగా కాకుండా కనీసం కొన్ని సార్లు అయిన ఉపయోగించాలి లేకపోతే అంతే సంగతులు.

మరింత సమాచారం తెలుసుకోండి: