డిప్రెషన్ తగ్గాలంటే ఈ డైట్ ఫాలో అవ్వండి..


అశ్వగంధ..అశ్వగంధను మన దేశంలో ఆయుర్వేద మందులలో ఏళ్ల తరబడి వాడుతున్న సంగతి తెలిసిందే. ఏ మెడికల్ స్టోర్‌లో అయినా మీకు ఈ అశ్వగంధ దొరుకుతుంది. దీని టాబ్లెట్లు కూడా మార్కెట్‌లో ఎక్కువగా ఉన్నాయి. మీరు ప్రతిరోజూ 1 గ్రాము అశ్వగంధ తింటే ఇక అది ఒత్తిడి నుంచి మీకు గొప్ప ఉపశమనం ఇస్తుంది. ఇక ఈ అశ్వగంధను మీరు పాలతో కూడా తీసుకోవచ్చు.

కుంకుమపువ్వు..కుంకుమపువ్వును ఆందోళన ఇంకా అలాగే ఒత్తిడిని తొలగించడానికి కూడా ఉపయోగిస్తారు. ఇది మెదడులోని సంతోషకరమైన హార్మోన్లను వెంటనే సక్రియం చేస్తుంది. ఆందోళన ఇంకా ఒత్తిడిని తొలగించడానికి కుంకుమపువ్వు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీనిని మనం ఒక క్లాత్‌లో చుట్టుకుని వాసన కూడా చూడొచ్చు. ఆహారంలోనూ చేర్చుకోవచ్చు.


మునగ ఆకులు... ఈ రోజుల్లో చాలా మంది ఈ మునగ ఆకులను ఎక్కువగా వాడుతున్నారు. ఒత్తిడిని తగ్గించడానికి కూడా వీటిని బాగా ఉపయోగిస్తారు. ఈ ఆకులు వాటి అద్భుత లక్షణాల కారణంగా సూపర్ ఫుడ్‌గా మంచి పేరుగాంచాయి. మునగ ఆకులను పొడి రూపంలో కూడా మీ ఆహారంలో చేర్చవచ్చు. ఆందోళన ఇంకా అలాగే ఒత్తిడిని తొలగించడానికి కరివేపాకు, బచ్చలికూర, గోధుమ గడ్డి, బ్రకోలీ ఇంకా ఇతర ఆకుపచ్చ కూరగాయలను ఆహారంలో చేర్చుకోవచ్చు.

 అరటిపండు.. ఇక అరటిపండు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే పండు. ఈ అరటి అరటిపండుని తినడం వల్ల శరీరంలో హ్యాపీ హార్మోన్స్ అనేవి దెబ్బకు యాక్టివేట్ అవుతాయి. ఇక మీకు ఆందోళనగా అనిపిస్తే, వెంటనే ఈ అరటిపండు తినండి. ఇది ఆ సమయంలో మీకు ఒక మంచి అనుభూతిని కలిగిస్తుంది. అరటిపండు రోజు తినడం వల్ల శరీరంలో మీకు చక్కెర సరఫరా బాగా అవుతుంది. అలాగే మీరు సంతోషంగా ఉంటారు. బనానా షేక్ లేదా స్మూతీని కూడా మీరు తాగవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: