శరీరంలో అధిక కొలెస్ట్రాల్ పేరుకు పోయి ఊబకాయంతో పాటు మరెన్నో సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శరీరంలో అధిక కొవ్వు తో ఇబ్బంది పడుతున్న వారికి ఇప్పుడు ఒక చక్కటి శుభవార్త అని చెప్పవచ్చు. అంతేకాదు ఇప్పుడు చెప్పబోయే కొన్ని పద్ధతులను పాటిస్తే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి .. మంచి కొలెస్ట్రాల్ పెంచుకోవచ్చు. అయితే ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలు సహజంగా మీ శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడతాయి. కాబట్టి ఆ చిట్కాలను ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.


ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్ చేయడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.. మీరు మీ శరీరంలో కొవ్వు ను తగ్గించుకోవాలంటే ప్రత్యేకంగా బరువు తగ్గ వలసిన అవసరం లేదు. కేవలం మీరు చక్కటి ఆహార నియమాలను పాటిస్తే ఎనిమిది శాతం వరకు చెడు కొవ్వును తగ్గించుకోవచ్చు.

వ్యాయామం చేయడం
మంచి కొలెస్ట్రాల్ ను పెంచే కొన్ని చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవడం కోసం వారానికి రెండు గంటలు వ్యాయామం చేయడం తప్పనిసరి. ఒకవేళ మీరు ఇప్పటివరకు వ్యాయామం చేయకపోయినా సరే ఇప్పుడు  నెమ్మదిగా ప్రారంభించండి అంతే కాదు ఇందులో మీకు నచ్చిన వ్యాయామాన్ని ఎంచుకోవడం వల్ల  చక్కటి ఫలితాలు అందుతాయి.

ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం..
బీన్స్ ,ఆపిల్స్ , ఓట్ మీల్  వంటి వాటిలో పుష్కలంగా ఫైబర్ లభిస్తుంది. కాబట్టి ఇది శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. మీరు తిన్న ఆహారం జీర్ణం అయేలా చేస్తుంది కాబట్టి శరీరంలో చెడు కొవ్వు పేరుకుపోయే అవకాశాలు ఉండవు. కాబట్టి ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను ఎంచుకోవాలి.

ఆలివ్ ఆయిల్ ఉండేలా చూసుకోవాలి..
ఆయిల్ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల మీ శరీరంలో 15 శాతం చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు. ఇక ఇందులో మంచి కొవ్వులు మీ గుండెకు మేలు చేసి, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి లభిస్తాయి. కాబట్టి రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: