ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో న‌మోదు అవుతున్న కేసుల‌న్నీ ఒమిక్రాన్ వేరియంట్‌వేనా.. అందుకు కేసుల సంఖ్య రోజు రోజుకు రెట్టింపు అవుతుందా..?  అంటే అవున‌నే స‌మాధానాలు వ‌స్తున్నాయి. తాజాగా క‌రోనా బారిన ప‌డుతున్న వారిలో క‌నిపిస్తున్న ల‌క్ష‌ణాలు ఏమిటో తెలుసుకుందాం.

ఏపీలో క‌రోనా వైర‌స్ జెట్ స్పీడ్ వేగంతో విస్త‌రిస్తోంది. జ‌న‌వ‌రి తొలివారంలో 200 లోపు ఉండే క‌రోనా కేసులు.. వారం వ్య‌వ‌ధిలోనే వేల మార్కు అందుకోవ‌డం.. మ‌రొక వారం రోజుల్ల‌నే ప‌దివేల మార్కును దాటిపోయాయి. తాజాగా న‌మోదైన కేసుల‌ను చూస్తుంటే 14వేల‌కు చేరువయ్యాయి. ఊహించ‌ని వేగంతో కేసులు పెర‌గ‌టానికి ప్ర‌ధాన కార‌ణం ఏపీ న‌మోదు అవుతున్న క‌రోనా కేసుల్లో 90 శాతం వేరియంట్ నిపుణులు పేర్కొంటున్నారు.

గ‌తంలో ఒమిక్రాన్ కేసులు నిర్థార‌ణ అవ్వాలంటే ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చే ఫ‌లితాల గురించి ఎదురు చూడాల్సి వ‌చ్చేది. ఇప్పుడు విజ‌య‌వాడ‌లోనే జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ రెడీ అయింది. అయితే ప్ర‌స్తుతం న‌మోదు అవుతున్న వాటిలో 90 శాతానికి పైగా కేసులు కొత్త వేరియంట్ వే అని జీనోమ్ సీక్వెన్సింగ్ కు వ‌స్తున్న శాంపిల్స్ ఫ‌లితాలు తెలుపుతున్నాయి.  ఈ విష‌యంలో  ముఖ్యంగా ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌ర‌ము లేద‌ని వైద్యారోగ్య అధికారులు భ‌రోసా ఇస్తున్నారు.  

క‌రోనా సెకండ్ వేవ్‌తోపోలిస్తే కేసుల వేగం క‌న్నా ప్ర‌స్తుతానికి ప్ర‌భావం త‌క్కువ‌గా ఉన్న‌ది. అయితే ప్ర‌స్తుతం ఆసుప్ర‌తుల‌లో చేరుతున్న వారి సంఖ్య త‌క్కువ‌గానే ఉన్న‌ది. అయితే చేరుతున్న వారు సైతం త్వ‌ర‌గానే కోలుకుంటున్నారు. పాజిటివ్ వ‌చ్చిన వారంలోపే మ‌ళ్లీ వారికి నెగిటివ్ వ‌స్తోంది. కాబ‌ట్టి ఒమిక్రాన్‌తో ఆందోళ‌న చెందా\ల్సిన అవ‌స‌రం లేద‌ని నిపుణులు పేర్కొంటున్నారు. ప్ర‌స్తుతం క‌రోనా బారిన ప‌డిన వారిలో అత్య‌ధికంగా ఇవే ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయి.

తొలి రెండు రోజులు చ‌లిచ‌లిగా ఉండ‌టం.. జ్వ‌రం, ఒళ్లు నొప్పులు, నీర‌సం, త‌ల‌నొప్పి ఉంటున్న‌ది. మూడ‌వ రోజు నుంచి జ్వ‌రం ఒళ్లునొప్పుడు త‌గ్గుముఖ్యం ప‌ట్టి జ‌లుబు, ముక్కు దిబ్బ‌డ‌, ముక్కు కార‌డం, గొంత‌లో గ‌ర‌గ‌ర‌, గొంతు మంట‌, ప‌ట్టేసిన‌ట్టు ఉండ‌టం, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. ఈ ల‌క్ష‌ణాలుకూడా క‌రోనా సోకిన ఎక్కువ మందిలో మూడు, నాలుగు రోజులకు పైగా ఉంటున్న‌ట్టు గుర్తించారు. వారం రోజుల్లో ఈ స‌మ‌స్య‌ల‌న్నీ పూర్తిగా నయం అవుతున్నాయి. సాధార‌ణ చికిత్స‌కే ఎక్కువ మంది కోలుకుంటున్నారు. అదేవిధంగా హోం ఐసోలేష‌న్‌లో ఉన్న‌వారు సైతం మూడు నాలుగు రోజుల‌కు పూర్తి ఆరోగ్య వంతులు అవుతున్నార‌ని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంటుంది.

ఆసుప‌త్రుల‌లో చేరుతున్న పాజిటివ్ రోగుల సంఖ్య‌చాలా త‌క్కువ‌గా ఉంటున్న‌ది. మెజార్టీ శాతం హోం ఐసోలేష‌న్  ఉంటూ వైర‌స్ నుంచి కోలుకుంటున్నారు. రెండు డోసులు టీకా తీసుకొని వారు అధిక ర‌క్త‌పోటు, మ‌ధుమేహం, గుండె, కిడ్నీ, జ‌బ్బులతో స‌హా ఇత‌ర అదుపులో లేని కొమొర్బెడిటీ జ‌బ్బుల‌తో బాధ‌ప‌డుతున్న వారే అధికంగా ఆసుప‌త్రుల్లో చేరుతున్నారు. విశాఖ కేజీహెచ్‌లో చేరిన వారి ప‌రిస్థితిని అధికారులు క్షుణ్ణంగా ప‌రిశీలించారు. ఒకే రోజులో 158 మంది చేర‌గా.. కేవ‌లం 10 మందికి మాత్ర‌మే ఆక్సిజ‌న్ అవ‌స‌రం ఏర్ప‌డిన‌ట్టు  గుర్తించారు. మిగిలిన వారికి సూచ‌న‌లు ఇచ్చి సాయంత్రం వ‌ర‌కు ఇంటికి పంపారు.

కోలుకుంటున్న వారిని ప‌రిశీలించిన త‌రువాత హోం ఐసోలేష‌న్ కిట్‌లో మార్పులు చేసింది. వైద్య, ఆరోగ్య శాఖ గ‌తంలో ఇచ్చిన కిట్ నుంచి జింక్ మాత్ర‌ల‌ను తొల‌గించారు. జింక్ వాడ‌టం వ‌ల్ల మ్యూకోర్మైకోసిస్ రావ‌డానికి ఆస్కారం ఉన్న‌ద‌ని అధ్య‌య‌నాల్లో వెల్ల‌డి అయింది. దీంతో జింక్‌ను తొల‌గించారు.జ సెట్రిజెన్ స్థానంలో లెవో సెట్రిజెన్ చేర్చారు. సెట్రిజెన్ వాడకం వ‌ల్ల మ‌త్తుగా ఉంటున్న‌ది. దీంతో ఈ మాత్ర స్థానంలో మ‌రొక మాత్ర‌ను చేర్చారు. ప్ర‌స్తుతం హోం ఐసోలేష‌న్ కిట్‌లో లెవో సెట్రిజెన్ విట‌మిన్ సీ, డీ బీకాంప్లెక్స్ పారా సెటిమాల్‌, ఫామోటిడిన్ మందులుంటున్నాయి.
ఈ వైర‌స్ బారిన ప‌డిన వారు రోజుకు క‌నీసం 2.5 లీట‌ర్ల నీటిని తాగాలి. నీరు, పండ్ల ర‌సాలు, మ‌జ్జిగ‌, ప్లూయిడ్స్ తీసుకోవాలి. ఎక్కువ ద్ర‌వ ప‌దార్తాలు తీసుకుని మూత్రాన్ని ఎక్కువ‌గా విస‌ర్జించ‌డం వ‌ల్ల పోస్ట్ కోవిడ్ ఇబ్బందుల‌ను అధిగ‌మించ‌వ‌చ్చు. సాధార‌ణ ప‌రిస్థితుల్లోకి రావ‌చ్చు అని నిపుణులు సూచిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: