చాక్లెట్లు చూస్తే పిల్లలు ఏ మాత్రం ఆగరు... వెంటనే తినాలని మారం చేస్తారు. అలాంటిది అన్నమే కాదు చాక్లెట్లు, స్వీట్స్  చూసినా అదోలా  మొఖం పెడుతూ... వద్దంటూ ఏడుస్తున్నారు అంటూ కరోనా టైంలో పలువురు పేరెంట్స్ చెబుతున్నారు. అయితే దీనిపై అధ్యయనం చేసిన  వైద్య నిపుణులు ఈ వింత ప్రవర్తనకు కారణం  కోవిడ్ అని అంటున్నారు. కరోనా సోకి కోలుకొన్న పిల్లలు, టీనేజర్లలో  'పరోస్మియా' అనే  వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అని దాని కారణం గానే పిల్లలు ఇలా ఆహారం పై అయిష్టత చూపెడుతున్నారు అని వివరిస్తున్నారు.
పుణెకు చెందిన పిల్లల వైద్యులు జగదీశ్‌ కత్వాటే ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు.

దేశంలో కరోనా వ్యాప్తి రాకెట్ స్పీడ్ తో విస్తరిస్తున్న విషయం తెలిసిందే. ఎటు చూసినా కరోనా మాటలే వినపడుతున్నాయి. వరుసగా నిత్యం వేలాది మంది కరోనా భారిన పడుతున్నారు. మొదటి ఒకటి, రెండు దశల్లో చిన్నారులకు పెద్దగా కరోనా సోకలేదు తక్కువ మంది మాత్రమే కరోనా భారిన పడ్డారు. అయితే  ప్రస్తుతం  కొత్త కరోనా మాత్రం పిల్లలనే ఎక్కువగా టార్గెట్ చేస్తోంది.  పిల్లలు భారీ స్థాయి లో కరోనా భారిన పడుతున్నారు. స్కూల్స్ లో కూడా కరోనా సోకిన విద్యార్థుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదు అవుతుంది.

తాజాగా ఏపి లోని ఓ స్కూల్ లో ఒకే సారి 50 మందికి పైగా విద్యార్థులకు కరోనా నిర్దారణ అయిందని వార్తలు వచ్చాయి. అయితే వ్యాప్తి వేగంగా ఉన్నప్పటికీ పెద్దగా ప్రమాదం లేక పోవడంతో తల్లి తండ్రులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఇపుడు వినిపిస్తున్న ఈ కొత్త న్యూస్  తల్లి తండ్రులను కలవరపెడుతోంది. అయితే ఇలా ఆహారం తినకుండా మారం చేస్తున్న పిల్లల పట్ల ముందు జాగ్రత్తగా డాక్టర్ ని సంప్రదించాలని ఈయన సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: