ఇక కరోనావైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత అయితే చికెన్ మటన్ తినడం అనేది మరింత పెరిగిపోయింది. చికెన్ మటన్ తినడం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉండవచ్చు అని నమ్ముతూ ఎంతోమంది తరచూ ఆహారంలో చికెన్ మటన్ లాంటివి ఉండేలా చూసుకుంటున్నారు. ముఖ్యంగా చికెన్ అయితే వారంలో నాలుగైదు సార్లు తినాల్సిందే అంటూ ఫిక్స్ అయిపోతున్నారు. ఇక మటన్ కాకుండా చికెన్ ను ఎక్కువగా ఇష్టపడే వారు కూడా లేకపోలేదు. అయితే చికెన్ తినేటప్పుడు ఎంతో టేస్ట్ గా అద్భుతంగా ఉన్నప్పటికీ చికెన్ ఎక్కువ తింటే మాత్రం కొన్ని సమస్యలు రావడం ఖాయం అని అంటున్నారు నిపుణులు.
డీప్ ఫ్రైడ్ చికెన్ రెగ్యులర్ గా తీసుకుంటే మాత్రం శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయే అవకాశం ఉందని అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ తేల్చింది. అంతేకాదు వేసవిలో చికెన్ ఎక్కువగా తినడం వల్ల శరీరంలో వేడి పెరిగిపోయి తద్వారా తరచూ ముక్కు కారడం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి అంటూ చెబుతున్నారు నిపుణులు. ఇక చికెన్ ఎక్కువగా తినడం వల్ల బరువు పెరిగే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుందట. చికెన్ లో ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉంటుందని అందుకే తొందరగా బరువు పెరిగి పోతారు అని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా యాంటీబయాటిక్స్ వాడిన చికెన్ తినడం వల్ల కూడా యూరినల్ సమస్యలు వచ్చే అవకాశం ఉందట. అందుకే చికెన్ తినడం మంచిదే కానీ ఎక్కువ తింటే మాత్రం సమస్యలు తప్పవు అంటున్నారు నిపుణులు.