ప్రపంచంలో ఎన్నో రకాల వ్యాధులు, జబ్బులు ఇవి చాలవు అన్నట్లు ప్రస్తుతం ప్రపంచ దేశాలు కొత్త కొత్త వైరస్ లతో అట్టుడికిపోతున్నాయి. ఎటు నుండి ఏ వైరస్ వచ్చి మనపై దాడి చేస్తుందో అని జనాలు వణికిపోతున్నారు. అయితే మన రోగనిరోధక శక్తి పదిలంగా, దృఢంగా ఉన్నంత వరకు మనం ఆల్మోస్ట్ సేఫ్ అనే చెప్పాలి. మరి రోగ నిరోధక శక్తి పెంచుకోవడం ఎలా అంటే చాలా మార్గాలే ఉన్నాయి. వ్యాయామం, పోషకాహారం, మంచి జీవన శైలి ఇలా చాలానే ఉన్నాయి. కాగా సి విటమిన్ కూడా మన రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు బాగా ఉపయోగపడుతుందని తెలిసే ఉంటుంది. సి విటమిన్ వలన మన శరీరానికి చాలా మేలును చేస్తోంది. ఇంతకీ సి విటమిన్ వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇపుడు తెలుసుకుందాం.

* ప్రధానంగా విటమిన్ సి వైరస్ పై తన ప్రభావం చూపి అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. వైరస్ నిరోధకంగా పనిచేస్తుంది.
విటమిన్ C వలన కొల్లజెన్ అనే పదార్థం తయారవుతుంది. ఇది మన శరీర సంరక్షణకు చాలా ఉపయోగకరం.
 
* శరీరంలో విరిగిన ఎముకులను అతికించడంలో విటమిన్ సి కీలక పాత్ర పోషిస్తుంది. కోల్పోయిన భాగాలను తిరిగి అతికించడం లో ముఖ్య భూమిక పోషిస్తుంది.

* అంతే కాకుండా గుండె లయను నియంత్రించి సక్రమంగా పనిచేయడంలో పనితీరును పటిష్టం చేయడంలో విటమిన్ సి చురుగ్గా పనిచేస్తుంది.

* క్యాన్సర్ కు యాంటీ ఆక్సిడెంట్ గా కూడా విటమిన్ సి పనిచేస్తుంది. అందుకే విటమిన్ సి ఉండే పదార్థాలను ఆహారంలో చేర్చుకోవాలి.

* పుల్లటి పదార్థాలలో విటమిన్ సి అధికంగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసే ఉంటుంది. ఉసిరి, నిమ్మ, కమల, టమోటా వంటి వాటిలో విటమిన్ సి ఎక్కువగా  ఉంటుంది.

ఇప్పుడు కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో మీ శరీరంలో వితమైన సి ని పెంచుకొని ఆరోగ్యాన్ని రక్షించుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: