ఇంట్లో పిల్లలు ఉన్నారు అంటే ఎన్నో జాగ్రత్తలు, ఆరోగ్య సూత్రాలు అవసరమే. పిల్లల్ని జాగ్రత్తగా సంరక్షించుకోవాల్సిన బాధ్యత తల్లి తండ్రులదే. అందుకే వారు అన్ని రకాలుగా తమ పిల్లల విషయాలను దగ్గరుండి చూసుకుంటారు. నిద్ర లేచినప్పటి నుండి నిద్ర పోయే వరకు అన్నిటినీ జాగ్రత్తగా చూసుకుంటారు. పేద వారు అయినా ధనవంతులు అయినా తల్లి తండ్రుల ప్రేమలో తేడా ఉండదు. ఇక ప్రస్తుతం చలి కాలం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చలి కాలంలో మీ పిల్లల సంరక్షణ గురించి ఈ వివరాలను తప్పక తెలుసుకోవాలి. ఇంతకు ఆ విషయాలు ఏమిటో తెలుసుకుందాం పదండి.

పిల్లల చర్మం చాలా మృదువైనది, సున్నితమైనది, అయితే ఈ చలి కాలంలో శరీరం పొడిబారడం సహజమే. కానీ దీని వలన దురద, మంట వంటివి కలుగుతుంటాయి. అయితే మీ పిల్లల చర్మం పొడి బారకుండా ఉండాలి అంటే ఆలివ్ ఆయిల్ తో బాగా మసాజ్ చేయండి. అలాగే పిల్లల బట్టలు తడిగా లేకుండా చూసుకోండి, లేదంటే ఈజీగా అనారోగ్యం పాలవుతారు. ఏ మాత్రం అశ్రద్ద చేయకుండా ఎప్పటికప్పుడు పిల్లల బెడ్ లేదా మంచమును నీటిగా ఉంచండి. చలి కాలంలో మూత్ర విసర్జన అధికంగా ఉంటుంది. కాబట్టి వారిని ఒక కంట కని పెడుతూ బట్ట తడిచిన వెంటనే మార్చుకోవాలి.

అలాగే శరీరాన్ని కూడా గోరు వెచ్చటి నీటిలో పొడి బట్టను ముంచి శుభ్రం చేస్తే మంచిది. అదే విధంగా గోరు వెచ్చటి నీటితో స్నానం చేయించండి. చలి ఎక్కువగా ఉంది అనిపిస్తే శుభ్రమైన బ్లాంకెట్ ను మీ పిల్లలకు కప్పండి. అలాగే స్వెట్టర్, తలను, చెవులను కప్పి ఉంచే క్యాప్ కూడా ధరించడం ముఖ్యమే. మీరు వారి శరీరంపై ఎటువంటి రాషెస్ ను గమనించినా లేట్ చేయకుండా హాస్పిటల్ కు తీసుకెళ్లండి.  

మరింత సమాచారం తెలుసుకోండి: