* పిల్లలకి వీలైనంత వరకు ప్రశాంతమైన వాతావరణం ఉండేలా జాగ్రత్తకు తీసుకోండి. వారిని ఒత్తిడికి గురి కాకుండా చూసుకోండి.
* రోజు పొద్దున్నే లేవగానే గోరు వెచ్చటి నీరు ఒక గ్లాసు తాగించండి. అలాగే మిగిలిన సమయంలో కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగించండి.
* సమయానికి నిద్రపోయేలా చూసుకోండి. పోషకాహారం విషయంలో అశ్రద్ద చూపకండి, జలుబు చేస్తే గోరు వెచ్చటి పాలల్లో చిటికెడు పసుపు కలిపి తాగించండి. పొడి బట్టల్ని వేయండి...సి విటమిన్ ఉండే పండ్లను వారి ఆహరంలో ఎక్కువగా ఉండేలా చూసుకోండి. సీజన్ లోలభించే పండ్లను ఇవ్వండి.
* ఒకవేళ జ్వరం వచ్చిందా కంగారు పడకుండా థర్మామీటర్ దగ్గర ఉంచుకుని టెంపరేచర్ చెక్ చేసుకోండి. ఫీవర్ సిరప్ ను వాడండి. శరీర ఉష్ణోగ్రత 101 దాటితే చల్లటి నీటిలో బట్టను ముంచి దాంతో శరీరాన్ని తుడవండి. అరచేతులను అలాగే అరి కాళ్ళ వద్ద చెమ్మ తగలకుండా చూసుకోండి. మూడు రోజుల తరవాత కూడా ఫీవర్ తగ్గకపోయినా లేదా హై ఫీవర్ వస్తూనే ఉన్న డాక్టర్ ని సంప్రదించాల్సిన అవసరం ఉంది.