దేశంలో కరోనా ఉదృతి భారీగా పెరిగింది. చిన్నా పెద్దా అంతా కరోనా భారిన పడుతూ ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇపుడు వస్తున్న వైరస్ పెద్దగా ప్రాణాలపై ప్రభావం చూపకపోవడంతో జనాలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. కా కపోతే పెద్దవారు అయితే దైర్యంగా ఉంటున్నారు. కానీ చిన్న పిల్లలు జలుబో లేక జ్వరమో వస్తే మాత్రం తల్లితండ్రులు చాలా కంగారు పడి పోతున్నారు. పిల్లలు అసలే తమకు ఆరోగ్యం ఎలా ఉందో సరిగా వివరించలేరు. ఎపుడు ఏ సమయం ఎలా ఉంటుందో ఈ వైరస్ ని నమ్మలేము అంటూ ఆందోళన చెందుతున్నారు. కాగా పలువురు వైద్య నిపుణులు ఈ విషయంపై తల్లి తండ్రులకు ఏమి సూచనలు ఇస్తున్నారు అంటే,

* పిల్లలకి వీలైనంత వరకు ప్రశాంతమైన వాతావరణం ఉండేలా జాగ్రత్తకు తీసుకోండి. వారిని ఒత్తిడికి గురి కాకుండా చూసుకోండి.

* రోజు పొద్దున్నే లేవగానే గోరు వెచ్చటి నీరు ఒక గ్లాసు తాగించండి. అలాగే మిగిలిన సమయంలో కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగించండి.

* సమయానికి నిద్రపోయేలా చూసుకోండి. పోషకాహారం విషయంలో అశ్రద్ద చూపకండి, జలుబు చేస్తే గోరు వెచ్చటి పాలల్లో చిటికెడు పసుపు కలిపి తాగించండి. పొడి బట్టల్ని వేయండి...సి విటమిన్ ఉండే పండ్లను వారి ఆహరంలో ఎక్కువగా ఉండేలా చూసుకోండి. సీజన్ లోలభించే పండ్లను ఇవ్వండి.

* ఒకవేళ జ్వరం వచ్చిందా కంగారు పడకుండా థర్మామీటర్ దగ్గర ఉంచుకుని టెంపరేచర్ చెక్ చేసుకోండి.  ఫీవర్ సిరప్ ను వాడండి. శరీర ఉష్ణోగ్రత 101 దాటితే చల్లటి నీటిలో బట్టను ముంచి దాంతో శరీరాన్ని తుడవండి. అరచేతులను అలాగే అరి కాళ్ళ వద్ద చెమ్మ తగలకుండా చూసుకోండి. మూడు రోజుల తరవాత కూడా ఫీవర్ తగ్గకపోయినా లేదా హై ఫీవర్ వస్తూనే ఉన్న డాక్టర్ ని సంప్రదించాల్సిన అవసరం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: