ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆరోగ్య సూత్రాలను పాటించడం తప్పనిసరి. మన ముఖం అందంగా ఉండాలంటే.. అందమైన చిరునవ్వు ఉండాలి. ఈ చిరునవ్వు కావాలంటే ఆరోగ్యవంతమైన పళ్ళు ఉండాల్సిందే. లేదంటే మీరు మీ పళ్ళను దాచుకుని నవ్వాల్సి వస్తుంది. అందుకే ఎప్పుడూ పళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అయితే పళ్ళను శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుకోవాలి అంటే కొన్ని నియమాలను పాటించాలి. ప్రతి రోజు రెండు సార్లు పళ్ళను తోమడం, ఉదయం తినక ముందు అలాగే రాత్రి పడుకునే ముందు బ్రెష్ చేయాలి. అదే విధంగా మనం వాడే బ్రష్ ను మూడు నెలలకు ఒకసారి అయినా ఖచ్చితంగా మార్చుకోవాలి.

ఎందుకంటే బ్రెష్ ప్లాస్టిక్ తో తయారు చేయబడి ఉంటుంది. ప్లాస్టిక్ లో ఉండేటటువంటి వైరస్ ఎక్కువ కాలం అందులోనే జీవించి ఉండగలదు. కావున ఆ వైరస్ భారిన పడి పళ్ళను పోగొట్టుకోవడం కన్నా టూత్ బ్రష్ ని తరచూ మారుస్తుండటం ఉత్తమం అంటున్నారు వైద్యులు.  ఇలా చేయడం వలన పళ్ళు పుచ్చిపోకుండా, అలాగే చిగుర్లు దెబ్బ తినకుండా సురక్షితంగా ఉంటాయి అంటున్నారు. ఇక అందులోనూ ఈ కరోనా వంటి విపత్కర సమయంలో టూత్ బ్రెష్ ని రెగ్యులర్ గా మార్చుకోవాలి. లేదంటే మీరు ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఉంది.

అలాగే ఈ మహమ్మారి కొనసాగుతున్న నేపథ్యంలో మీ పిల్లల బ్రష్ ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండండి. వారు వాడిన తరవాత బ్రెష్ ను నీట్ గా శుభ్ర పరిచి జాగ్రత్త చేయండి. అలాగే ఇంట్లో కనుక ఎవరికైనా వైరస్ సోకి ఉంది అంటే వారు కోలుకున్న వెంటనే బ్రష్ ను రెండు సార్లు మార్చండి. అలాగే బ్రష్ ను ఇతర బ్రష్ లకు దూరం గా ఉంచండి. లేదంటే వేరే బ్రష్ లలోకి సైతం వైరస్ చేరే అవకాశం ఉందట.

మరింత సమాచారం తెలుసుకోండి: