సజ్జలు అనగానే చాలామందికి సంక్రాంతి పండుగ మాత్రమే గుర్తొస్తుంది.. ఎందుకంటే సంక్రాంతి పండుగ ముందు రోజును అంటే భోగినాడు ముఖ్యంగా పల్లెటూరి ప్రాంతాలలో నల్ల నువ్వులు, సజ్జలు, బెల్లం, కొబ్బరి ఇలా అన్నీ పదార్థాలను మెత్తగా రుబ్బి చలివిడి తయారు చేస్తారు. ఇక ఈ చలివిడి తినడం వల్ల మంచి శరీర పుష్టి, మహిళలకు నెలసరి సమస్యలు, కాళ్ల నొప్పులు, రక్తహీనత ఇలా అన్ని సమస్యలు దూరమవుతాయని పెద్దలు విశ్వసించేవారు.. ఇకపోతే సజ్జనులతో కిచిడీ లేదా రొట్టె చేసుకుని తినడం వల్ల ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభించి శరీరంలో మెటబాలిజం పెరిగి ఊబకాయం వచ్చే సమస్య తగ్గుతుంది.

అంతేకాదు ఈ సజ్జలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి అని వైద్యులు సైతం సూచిస్తున్నారు.. సజ్జలు తినడం వల్ల మనకు కలిగే ప్రయోజనాల విషయానికి వస్తే జీర్ణవ్యవస్థ సవ్యంగా పని చేయాలి అంటే.. అలాగే  జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు దూరం కావాలి అంటే.. తప్పకుండా సజ్జలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఇందులో లభించే ఫైబర్ మూలంగా జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేయడంతో పాటు జీర్ణ సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి. ఇక చర్మ సౌందర్యానికి చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉండటం వల్ల ముడతలు వచ్చే అవకాశమే లేదు.. పైగా యవ్వనంగా తాజాగా ముఖ చర్మం మెరిసిపోతుంది.

అంతే కాదు వీటిలో తక్షణ శక్తినిచ్చే యాంటీ బయోటిక్స్ ఉన్నాయి కాబట్టి రోగ నిరోధక శక్తి తో పాటు రోగ నిరోధక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుంది. కొలెస్ట్రాల్ ను నియంత్రించడం లో సజ్జలు ప్రభావంతంగా పనిచేస్తాయి. ఫలితంగా సజ్జలు తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు కూడా దూరమవుతాయి. అంతేకాదు వీటిని తరచూ తినడం వల్ల కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుంది. అంతేకాదు ఐరన్ లోపంతో బాధపడే వారు వీటిని పుష్కలంగా తినాలి. రొట్టెకు బదులు సజ్జలతో కిచిడి కూడా చేసుకొని తినవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: